పవిత్రా లోకేశ్.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కన్నడ, తెలుగు, తమిళ సినిమాల్లో ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించింది. సినిమాల్లోనే కాకుండా అటు బుల్లితెర, వెబ్ సిరీస్ లోనూ నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. అయితే ఇటీవల కొద్దిరోజులుగా పవిత్రా లోకేశ్ పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తూ వచ్చాయి. నరేష్‌తో పవిత్రా లోకేశ్ సహజీవనం చేస్తున్నట్లు.. త్వరలోనే వీరు పెళ్లి చేసుకోబోతున్నట్లు ఈ వార్తల సారాశం. ఇక నరేష్ కూడా ఈ వార్తలపై స్పందించారు. నాలుగేళ్ల క్రితమే పవిత్ర లోకేష్ తన జీవితంలోకి వచ్చిందని తెలిపారు.
ఈ నేపథ్యంలో ఆమెపై కన్నడకు చెందిన ‘పవర్ టీవీ’ అనే ఛానల్ ఓ స్ట్రింగ్ ఆపరేషన్ నిర్వహించింది. ఈ స్ట్రింగ్ ఆపరేషన్ వీడియోలో పవిత్రా లోకేశ్.. తనపై వస్తున్న వార్తలపై స్పందించింది. దీనిలో పవిత్ర లోకేష్ చెప్పిన మాటలకు భిన్నంగా ఆమె భర్త సుచేంద్ర లోకేష్ చేసిన వ్యాఖ్యలు సెన్సేషనల్‌గా మారాయి. అలాగే వీకే నరేష్ కన్నడ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ అత్యంత వివాదంగా మారింది. ఈ క్రమంలో పవిత్రా లోకేష్ భర్త సుచేంద్ర మీడియాతో మాట్లాడుతూ…
‘‘పవిత్రా లోకేష్‌తో జీవితం తొలినాళ్లలో బాగానే ఉంది. మాకు ఇద్దరు పిల్లలు కలిగిన తర్వాత నన్ను వదిలేసి వెళ్లింది. ఆమెది కాపురాలను కూల్చే బుద్ది. ఒక నటిగా ఉన్న ఆమెకు ఇలాంటి తీరు మంచిది కాదు. చాలాసార్లు నేను ఆమెకు నచ్చ చెప్పే ప్రయత్నం చేశాను. కానీ ఆమె తీరు మార్చుకోలేదు. పవిత్ర నన్ను వదిలేసి వెళ్లిన తర్వాత నేను చాలా బ్యాలెన్స్‌గా ఉన్నాను. నాకు ఇష్టమైన సాహిత్య జీవితంతో కాలం వెళ్లదీస్తున్నాను. ప్రస్తుతం నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఒంటరి జీవితమే బాగుందనిపిస్తుంది’’ అని చెప్పుకొచ్చాడు.
ఇది కూడా చదవండి: Naresh: మూడో భార్య రమ్యపై సంచలన వ్యాఖ్యలు చేసిన నటుడు నరేష్
‘‘నా దగ్గర డబ్బు లేదని.. నన్ను విడిచి వెళ్లింది. పవిత్రా లోకేష్ రిలేషన్‌లో మొదటి నుంచి ఓటమే. ఈమె వల్ల ఎవరికో అన్యాయం జరిగేది. డబ్బులు, లగ్జరీ లైఫ్ లీడ్ చేయడమే పవిత్రా లోకేష్ లక్ష్యం. ఆర్థికంగా నేను ఆమె స్థాయికి లేకపోవడం వల్ల నన్ను విడిచిపోయింది. నన్ను మోసం చేసి వెళ్లిపోయింది’’ అని తెలిపాడు.
‘‘కాపురాలు కూల్చే వ్యక్తి ఆమె. అలాంటిది నేను కొట్టడం, తిట్టడం లాంటివి చేస్తానని చెప్పింది. ఒకవేళ.. ఆమె ప్రవర్తన నచ్చక నేను కోప్పడితే.. వెళ్లి నరేష్‌తో ఉండటం కరెక్టా.. మరో కాపురాన్ని కూల్చడం కరెక్టేనా.. ఆమెకు కాపురాలు కూల్చడం అలవాటే. వీలును బట్టి, సమయం చిక్కితే ఎంత దొరికితే అంత దోచుకొనే మనస్తత్వం పవిత్రా లోకేష్‌ది. ఆమెకు జీవితంపై ఆశలు ఎక్కువ. అందుకే నన్ను వదిలేసి వెళ్లిపోయింది’’ అంటూ సుచేంద్ర ప్రసాద్ భార్యపై సంచలన ఆరోపణలు చేశాడు.
ఇది కూడా చదవండి: Pavitra Lokesh: నటి పవిత్రా లోకేశ్‌పై కన్నడ ఛానల్ స్ట్రింగ్ ఆపరేషన్.. వీడియో వైరల్!
‘‘పవిత్రా లోకేష్ ది దోచుకొనే మనస్తత్వం. ఆమెకు కష్టపడే మనస్తత్వం లేదు. ప్రస్తుతం నన్ను వదిలేసి.. నరేష్‌ను పట్టుకొన్నది. ఒకేవేళ నరేష్‌ను పవిత్రా లోకేష్ పెళ్లి చేసుకొన్నా.. ఆరు నెలల్లో వదిలేస్తుంది. డబ్బు చేతికి రాగానే ఆమె నరేష్‌ను కూడా వదిలేస్తుంది. పవిత్రా లోకేష్ మనసు ఏమిటో నాకు బాగా తెలుసు’’ అని సుచేంద్ర ప్రసాద్ తీవ్రమైన ఆరోపణలు చేశాడు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. సుచేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Naresh: 4 ఏళ్ళ క్రితమే పవిత్రా లోకేష్ నా జీవితంలోకి వచ్చింది: నరేశ్