పవిత్రా లోకేశ్.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కన్నడ, తెలుగు, తమిళ సినిమాల్లో ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించింది. సినిమాల్లోనే కాకుండా అటు బుల్లితెర, వెబ్ సిరీస్ లోనూ నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. అయితే ఇటీవల కొద్దిరోజులుగా పవిత్రా లోకేశ్ పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తూ వచ్చాయి. ఒక ప్రముఖ నటుడితో పవిత్రా లోకేశ్ సహజీవనం చేస్తున్నట్లు.. త్వరలోనే వీరు పెళ్లి చేసుకోబోతున్నట్లు ఈ వార్తల సారాశం. అయితే ఈ వార్తలపై ఆ నటుడుగానీ, పవిత్రా లోకేశ్ గానీ ఎక్కడా స్పందించింది లేదు. ఈ నేపథ్యంలో ఆమెపై కన్నడకు చెందిన ‘పవర్ టీవీ’ అనే ఛానల్ ఓ స్ట్రింగ్ ఆపరేషన్ నిర్వహించింది. ఈ స్ట్రింగ్ ఆపరేషన్ వీడియోలో పవిత్రా లోకేశ్.. తనపై వస్తున్న వార్తలపై స్పందించింది. దీంతో.. ప్రస్తుతం కన్నడనాట పవర్ టీవీ చేసిన స్ట్రింగ్ ఆపరేషన్ వీడియో వైరల్ గా మారింది. మరి.. ఈ వైరల్ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇదీ చదవండి: పోలీసులను ఆశ్రయించిన నటి పవిత్రా లోకేష్! కారణం? ఇదీ చదవండి: ప్రశాంత్ నీల్ సూపర్ ట్విస్ట్! సలార్ మూవీలోకి యశ్ ఎంట్రీ!