నరేష్, పవత్ర లోకేష్ జంటగా కలిసి నటించిన చిత్రం మళ్ళీ పెళ్లి. ఈ మూవీ ప్రమోషన్ లో భాగంగా నరేష్ ను యాంకర్.. పవిత్ర మీకు పడిందా..? మీ ఆస్తికి పడిందా..? అంటూ సూటి ప్రశ్న అడిగారు. దీనికి నరేష్ ఏం సమాధానమిచ్చారో తెలుసా?
పవిత్ర లోకేష్, నరేష్.. వీళ్లిద్దరే గత కొంత కాలంగా సోషల్ మీడియాను ఆక్రమించేశారు. టీవీల్లో కానీ, సోషల్ మీడియాలో కానీ, ఎక్కడ చూసినా వీళ్ల గురించే కథనాలు, చర్చలు ఊపందుకున్నాయి. ఇక నరేష్ పవిత్రను మూడో పెళ్లి చేసుకోబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. త్వరలో మళ్ళీ పెళ్లికి అందరినీ పిలుస్తామని కూడా అంటున్నారు ఈ జంట. కానీ, సోషల్ మీడియాలో మాపై వచ్చిన ట్రోల్స్ మమ్మల్ని తీవ్రంగా బాధించాయని, వాటికి అస్సలు భయపడమని కూడా చెబుతున్నారు నరేష్, పవిత్ర. ఇదిలా ఉంటే నరేష్, పవత్ర లోకేష్ జంటగా కలిసి నటించిన తాజా చిత్రం మళ్ళీ పెళ్లి. ఈ మూవీకి ఎంఎస్. రాజు దర్శకత్వం వహించారు. ఈ మధ్యే విడుదలైన ఈ మూవీ మంచి హిట్ టాక్ తో దూసుకుపోతోంది.
కాగా, ఈ మూవీ విడుదలకు ముందు సినిమా యూనిట్ ప్రమోషన్ లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే నటుడు నరేష్ కు ఓ యాంకర్ సూటి ప్రశ్న వేశారు. ఇప్పటికీ ఇద్దరిని పెళ్లి చేసుకున్నారు. పవిత్రను మూడో పెళ్లి చేసుకోబోతున్నారు.. వీళ్లంతా మిమ్మల్ని చూసి వస్తున్నారా లేక మీ ఆస్తిని చూసి వస్తున్నారా అని అడిగారు. దీనికి నరేష్ సమాధానమిస్తూ.. నాకు ఆస్తి లేనప్పుడు వెళ్లిపోయినవాళ్లు ఉన్నారు, ఆస్తి కోసం వచ్చిన వాళ్లూ ఉన్నారు. ఇవన్నీ చూసిన పుస్తకమే నేనంటూ నరేష్ అన్నారు. వ్యామోహానికి, ప్రేమకు చాలా తేడా ఉంది. ఈ రెండిటినీ ఏనాడో చూసేశాను. కానీ, నాకు పవిత్రలో నచ్చింది మాత్రం నిస్వార్ధంగా ఉండడం అని నరేష్ వివరించారు.