టాలీవుడ్ మోస్ట్ రొమాంటిక్, కాంట్రవర్సియల్ కపుల్ ఎవరైనా ఉన్నారంటే.. నరేష్, పవిత్ర దంపతులే. ఓ సినిమా షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డ ఈ జంట.. ఆ తర్వాత డేటింగ్‌లో ఉన్నారు.
టాలీవుడ్ మోస్ట్ రొమాంటిక్, కాంట్రవర్సియల్ కపుల్ ఎవరైనా ఉన్నారంటే.. నరేష్, పవిత్ర దంపతులే. ఓ సినిమా షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డ ఈ జంట.. ఆ తర్వాత డేటింగ్‌లో ఉన్నారు. అప్పటికే నరేష్‌కు మూడు పెళ్లిళ్లు అయ్యాయి. మూడో భార్య రమ్య రఘుపతితో కలిసి ఉన్న సమయంలోనే ఆమెతో ఏర్పడిన పరిచయం.. ప్రణయంగా మారింది. ఆ తర్వాత అనేక పరిణామాలు ఏర్పడ్డాయి. రమ్యతో నరేష్ దూరంగా ఉండటంతో పాటు వీరిద్దరూ మరింత దగ్గర కావడం.. ఆ విషయం రమ్య మీడియా ముందు బహిర్గతం చేయడం జరిగాయి. అలా తన నిజ జీవితగాథను ఆధారంగా తీసుకుని తెరకెక్కించిన సినిమానే మళ్లీ పెళ్లి.
తన జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన మళ్లీ పెళ్లిలో నటీనటులు కూడా వీరిద్దరే కావడం గమనార్హం. ఈ సినిమా ప్రకటించిన నాటి నుండే కాంట్రవర్సీతో మొదలైంది. ఇక వారి పాత్రల్లో వారే నటించారు. ఇక రమ్య పాత్రలో విజయ్ కుమార్ కుమార్తె వనిత నటించారు. ఈ సినిమాను సీనియర్ నిర్మాత, దర్శకుడు ఎం ఎస్ రాజు తెరకెక్కించారు. మే 26న కాంట్రవర్సీల మధ్యే విడుదలయ్యింది. మిక్స్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి విడుదలయ్యేందుకు సిద్ధమైంది. ఈ నెల 23న అనగా.. ఈ శుక్రవారం నుండి ఓటీటీలో ప్రసారం కానుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా.. దీన్ని కొనుగోలు చేసింది.