క్రిష్ జాగర్లమూడి అప్‌కమింగ్ క్రేజీ ప్రాజెక్ట్ ‘కొండపొలం’ ట్రైలర్ వచ్చేసింది. ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా నటిస్తున్నారు. అక్టోబరు 8న థియేటర్లలో రిలీజ్ కానుంది. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. రవీంద్ర బాబు, ఓబులమ్మ జోడీ చాలా బాగుందని టాక్ వచ్చింది. నల్లమల అడవి, గొర్రెలకాపర్ల జీవితాల నేపథ్యంలో ‘కొండపొలం’ నవల ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ఇది. వైష్ణవ్ తేజ్ తాతగా కోట శ్రీనివాసరావు, తండ్రి పాత్రలో సాయి చంద్ నటన అద్భుతంగా ఉంది. ప్రస్తుతం ఈ ట్రైలర్ యూట్యూబ్‌లో వైరల్‌గా మారింది. మరి, మీరూ ఓ లుక్కేయండి.