చిత్రరంగంలో విషాదం నెలకొంది. ప్రముఖ దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత జాన్ జారిత్ స్కీ కన్నుమూశారు. 1983లో ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రంగా జాన్ జారిత్ స్కీ తెరకెక్కించిన ‘జస్ట్ అనదర్ మిస్సింగ్ కిడ్‘ ఆస్కార్ అవార్డు తెచ్చిపెట్టింది. తాజా సమాచారం ప్రకారం.. జాన్ జారిత్ స్కీ కొంతకాలంగా గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నాడని, హార్ట్ ఫెయిల్యూర్ కారణంగానే ఇటీవల(మార్చి 30న) ఆయన కెనడాలోని వాంకోవర్ జనరల్ హాస్పిటల్‌లో చనిపోయినట్లు తెలుస్తుంది.
ఇక 79 ఏళ్ల వయసులో జాన్ జారిత్ స్కీ గుండె ఫెయిల్యూర్ అవ్వడంతో మరణించారు. ఇక ఇండస్ట్రీలో 40 ఏళ్లపాటు సాగిన సుదీర్ఘ సినీ ప్రయాణంలో.. జాన్ 1950ల చివరలో ఐరోపాలో ప్రవేశపెట్టిన థాలిడోమైడ్ పై డాక్యుమెంటరీలకు దర్శకత్వం వహించారు. అదేవిధంగా కెరీర్ లో ఎన్నో డాక్యుమెంటరీలు రూపొందించి మంచి పేరు సంపాదించుకున్నారు. కెరీర్ లో బెస్ట్ డైరెక్టర్ గా కూడా ఎన్నో అవార్డులు అందుకున్నారు.
ఇవేగాక జాన్ తెరకెక్కించిన బెస్ట్ డాక్యుమెంటరీలలో ‘స్కీ బమ్స్’ కూడా ఒకటి. ఈ డాక్యుమెంటరీని ఆయనకు ఇష్టమైన ప్రాంతాలలో షూట్ చేసినట్లు హాలీవుడ్ వర్గాలు తెలిపాయి. అయితే.. జాన్ జారిత్ స్కీ రూపొందించిన డాక్యుమెంటరీలు అతనికి ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతిని తీసుకొచ్చాయి. అందులోనూ జాన్ పనితనం గురించి దాదాపు 35 దేశాలకు పైగా తెలియగా, సన్ డాన్స్, టొరంటోలతో సహా 40కి పైగా ఫిలిం ఫెస్టివల్స్ లో ఆయన చిత్రాలు ప్రదర్శించబడ్డాయి. మరి దర్శకుడు జాన్ జారిత్ స్కీ అకాల మరణంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.