సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లపై లైంగిక వేధింపులు దారుణంగా జరుగుతుంటాయని పలువురు నటీమణులు సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. క్యాస్టింగ్ కౌచ్ అనేది ఇండస్ట్రీలో ఎక్కువగా ఉంటుందని చాలామంది హీరోయిన్లు తమ ఆవేదన వ్యక్తం చేశారు.
గత కొంత కాలంగా సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రముఖ నటులు, దర్శక, నిర్మాతలు వారి బంధువులు కన్నుమూస్తున్నారు. దీంతో వారి కుటుంబ సభ్యులే కాదు ఫ్యాన్స్ సైతం శోక సంద్రంలో మునిగిపోతున్నారు. తాజాగా మాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు కార్యవట్టం శశికుమార్ కన్నుమూశారు. మాలీవుడ్ లో పలు చిత్రాలు, టీవీ సీరియల్స్ లో నటించిన కార్యవట్టం శశికుమార్ సోమవారం తిరువనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస […]
చిత్రరంగంలో విషాదం నెలకొంది. ప్రముఖ దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత జాన్ జారిత్ స్కీ కన్నుమూశారు. 1983లో ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రంగా జాన్ జారిత్ స్కీ తెరకెక్కించిన ‘జస్ట్ అనదర్ మిస్సింగ్ కిడ్‘ ఆస్కార్ అవార్డు తెచ్చిపెట్టింది. తాజా సమాచారం ప్రకారం.. జాన్ జారిత్ స్కీ కొంతకాలంగా గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నాడని, హార్ట్ ఫెయిల్యూర్ కారణంగానే ఇటీవల(మార్చి 30న) ఆయన కెనడాలోని వాంకోవర్ జనరల్ హాస్పిటల్‌లో చనిపోయినట్లు తెలుస్తుంది. ఇక 79 ఏళ్ల వయసులో జాన్ […]
అమెరికాకు చెందిన డ్యాక్యుమెంటరీ ఫిలిమ్ దర్శకుడు జెరీమీ కార్బెల్ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. అమెరికాకు చెందిన ఒక యుద్ధనౌకను కొన్ని యూఎఫ్‌వోలు చుట్టుముట్టినట్లు చెప్పారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన ట్వీట్ చేశారు. ఇందులో 9 వస్తువులు నౌకకు దగ్గరగా రావడం కనిపించింది. ఈ వీడియో ఫుటేజ్ నిజమైందేనని అమెరికా రక్షణ శాఖ కూడా ధ్రువీకరించింది. గ్రహాంతరవాసుల వ్యోమనౌకలుగా భావిస్తున్న ‘ఫ్లయింగ్ సాసర్లు’ అప్పుడప్పుడూ భూమిని సందర్శించి వెళుతున్నాయా? ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. […]