సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లపై లైంగిక వేధింపులు దారుణంగా జరుగుతుంటాయని పలువురు నటీమణులు సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. క్యాస్టింగ్ కౌచ్ అనేది ఇండస్ట్రీలో ఎక్కువగా ఉంటుందని చాలామంది హీరోయిన్లు తమ ఆవేదన వ్యక్తం చేశారు.
సినీ ఇండస్ట్రీ అంటే ఓ రంగుల ప్రపంచం అంటారు.. కానీ ఆ రంగుల ప్రపంచం వెనుక ఎన్నో కష్టాలు.. కన్నీళ్లు కూడా ఉంటాయి. వెండితెరపై ఎంతో సంతోషంగా, హుందాగా కనిపించే నటీనటులు నిజ జీవితంలో ఎన్నో బాధలు అనుభవించి ఉంటారు. సినీ ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో క్యాస్టింగ్ కౌచ్ గురించి ఏదో ఒక సందర్భంలో వినిపిస్తూనే ఉంటుంది. అవసరం, కెరీర్ లో ఎదగాలనేవారు అడ్డదారులు తొక్కుతుంటారు. కానీ.. తమ టాలెంట్ పై నమ్మకం ఉన్నవాళ్లు నటనతో సత్తా చాటి కెరీర్ లో ముందుకు సాగుతారు. చాలా మంది హీరోయిన్లు ఇండస్ట్రీలో లైంగికంగా వేధింపులకు గురైనవారే అంటుంటారు. అలా లైంగిక వేధింపుల భారిన పడిన నటి శీతల్ పాత్ర. తాజాగా ఆమె ఓ నిర్మాతపై సంచలన కామెంట్స్ చేసింది. వివరాల్లోకి వెళితే..
ఒడిషా నటి శీతల్ పాత్ర ఓ నిర్మాత తనను దారుణంగా మోసం చేశాడని పోలీసులను ఆశ్రయించింది. అంతేకాదు సదరు నిర్మాత తన ప్రైవేట్ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ చేశాడని ఆరోపించడం సంచలనంగా మారింది. నటి శీతల్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. ఒడియా ఇండస్ట్రీలో నటి శీతల్ పాత్రకు మంచి పేరు ఉంది. ఆమె నిర్మాత దయానిధి దహిమా పై జులై 28న భువనేశ్వర్ లోని లక్ష్మీసాగర్ లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎంటర్ టైన్‌మెంట్ యజమాని దయానిధి తనపై లైంటిక, మానసిక వేధింపులకు గురి చేశారని ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాదు తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని.. గతంలో తీసుకున్న రెమ్యూనరేషన్ వాపస్ ఇవ్వాలని బెదిరిస్తున్నాడని ఆమె ఆరోపించింది.
ఎంత వేధించినా నేను వినకపోవడంతో తన ప్రైవేట్ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తానని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఇటీవల తనపై భౌతిక దాడికి కూడా పాల్పపడ్డారని పోలీసులకు తెలిపింది. తాను చదువుకున్న కాలేజ్ లో తన పై దాడి చేసి దుస్తులను చించేసి ఘోరంగా అవమానించాడని ఫిర్యాదులో పేర్కొంది. తన కుటుంబ సభ్యులను కూడా టార్గెట్ చేసుకొని ఇబ్బందులు పెట్టాడని కన్నీరు పెట్టుకుంది. గత కొంతకాలంగా తాను నిర్మాతతో లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్నానని.. దాన్ని ఆసరాగా తీసుకొని అతను నన్ను మోసం చేశాడని ఫిర్యాదులో పేర్కొంది.
ఈ సందర్భంగా నటి శీతల్ పాత్రా మాట్లాడుతూ.. ‘కెరీర్ బిగినింగ్ లో అతను నాతో చాలా సన్నిహితంగా ఉన్నాడు.. అందుకే అతన్ని చాలా నమ్మాను. ఆ సమయంలో నా పర్సనల్ ఫోటోలు, వీడియోలు రికార్డు చేసేవాడు. ఆ సమయంలో వాటిని పట్టించుకోలేదు. ఆయనతో సినిమా కూడా చేశాను.. దానికి రెమ్యూనరేషన్ ఇవ్వలేదు. అప్పటి నుంచి మా మధ్య అభిప్రాయభేదాలు వచ్చాయి.. నన్ను దారుణంగా తిట్టేవాడు.. చేయి చేసుకునేవాడు. ఇప్పుడు నా ప్రైవేట్ వీడియోలు, ఫోటోలు నెట్టింట షేర్ చేసి నా పరువు తీశాడు’ అంటూ కన్నీరు పెట్టుకుంది. ఈ క్రమంలోనే అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపింది.