గత కొంత కాలంగా సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రముఖ నటులు, దర్శక, నిర్మాతలు వారి బంధువులు కన్నుమూస్తున్నారు. దీంతో వారి కుటుంబ సభ్యులే కాదు ఫ్యాన్స్ సైతం శోక సంద్రంలో మునిగిపోతున్నారు. తాజాగా మాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు కార్యవట్టం శశికుమార్ కన్నుమూశారు.
మాలీవుడ్ లో పలు చిత్రాలు, టీవీ సీరియల్స్ లో నటించిన కార్యవట్టం శశికుమార్ సోమవారం తిరువనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. కెఎస్ గోపాలకృష్ణన్ దర్శకత్వంలో 1989లో విడుదలైన ‘క్రైమ్ బ్రాంచ్’ చిత్రంతో ఆయన సినీ రంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించిన ఆయన తర్వాత బుల్లితెరపై అడుగు పెట్టారు.
ఇండస్ట్రీలో అందరితో స్నేహంగా ఉంటూ.. అందరినీ అప్యాయంగా పలుకరించే మంచి నటుడిని కోల్పోయమని నటి సీమా జి నాయర్ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు. అలాగే నటుడు బాలాజీ శర్మ, చిత్రనిర్మాత మధుపాల్, ప్రొడక్షన్ కంట్రోలర్ ఎన్ఎమ్ బాదుషా కూడా సోషల్ మీడియాలో సంతాప సందేశాలను పోస్ట్ చేశారు. కార్యవట్టం శశికుమార్ మరణం పట్ల మాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేశారు.
ఇది చదవండి : కృష్ణం రాజు సతీమణిని కలిసి పరామర్శించిన బాలకృష్ణ దంపతులు!