సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకుడు కన్ను మూశారు. ఇటీవల కాలంలో సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తమదైన ప్రతిభతో విశేష ఆదరణ సొంతం చేసుకున్న ప్రముఖులు ఒక్కొక్కరిగా ప్రేక్షకులను, అభిమానులను అనాథలను చేసి వెళ్లిపోతున్నారు. తాజాగా ప్రముఖ దర్శకుడు అనారోగ్యం కారణంగా తిరిగి రాని లోకానికి వెళ్లిపోయారు. ఆయన చేసింది నాలుగే సినిమాలు అయినా ఆయనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. మొదటి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఆయనే అశోకన్(60). జన్మతః రామన్ అశోక్ కుమార్ అయిన ఆయన మలయాళ ఇండస్ట్రీలో మాత్రం అశోకన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు.
1980లో దర్శకుడు శశి కుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ను ప్రారంభించిన అశోకన్.. మలయాళంలో వచ్చిన సైకలాజికల్ డ్రామా వర్ణం సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. దర్శకుడు తాహతో కలిసి రెండు సినిమాలకు దర్శకత్వం వహించారు. ఒకటి సురేష్ గోపి నటించిన సాంద్రం సినిమా కాగా, మరొకటి మూకిళ్ల రాజ్యతు. ఈ రెండు సినిమాలకి నిర్మాతగా కూడా వ్యవహరించారు అశోకన్. 2003లో ఈయన దర్శకత్వంలో మలయాళ కైరాలీ టీవీలో ప్రసారమైన ‘కనప్పురమున్’ ఉత్తమ టెలిఫిల్మ్ గా రాష్ట్ర ప్రభుత్వ అవార్డును గెలుచుకుంది. ఆ తర్వాత అశోకన్ సింగపూర్ కి వెళ్లిపోయారు. బిజినెస్ లోకి అడుగుపెట్టారు. గల్ఫ్, కొచ్చిలో ఐటీ కంపెనీలు కూడా ఉన్నాయి. ఈయనకు భార్య, కుమార్తె ఉన్నారు. దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న ఆయన కొచ్చిలోని ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశారు. అశోకన్ మృతితో కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు.
Malayalam director #Ashokan who made films like ‘Varnam’ and ‘Acharyan’ passed away at a hospital in Kochi of #Kerala on Sunday night.https://t.co/8nTWPPYxPx
— TheNewsMinute (@thenewsminute) September 26, 2022