కొంతమంది అందంతో, అభినయంతో ఆకర్షిస్తారు, అనసూయలాగా. ఇంకొంతమంది మాటలతో ఆకర్షిస్తారు, సుమలాగా. యాంకర్ గా, నటిగా అనసూయ ఏంటో ప్రూవ్ చేసుకున్నారు. ఇక సుమ కనకాల గురించి చెప్పాల్సిన పనే లేదు. యాంకర్లు హాట్ గా లేకపోతే ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం కష్టమనుకునే ఈ రోజుల్లో.. హాట్ నెస్ అనే పదానికి చోటు ఇవ్వకుండా సుమ సక్సెస్ ఫుల్ యాంకర్ గా రాణిస్తున్నారంటే చిన్న విషయమేమీ కాదు. గ్లామర్ తో కాదు మాటలతో పడగొట్టడంలో దిట్ట. పంచులతో ఎగస్ పార్టీలను సైతం ఆకర్షించడంలో ఎక్స్ పర్ట్. అలాంటి సుమ, గ్లామరస్ బ్యూటీ అనసూయ ఒక చోట చేరితే ఎలా ఉంటుంది? ఫ్యాన్స్ కి కన్నుల పండుగే కదా.
సుమక్కకి యూట్యూబ్ ఛానల్ ఉందని, అందులో ఆమె రెగ్యులర్ గా వీడియోలు చేస్తుంటారని మనందరికీ తెలిసిందే. తాజాగా ఆమె దసరా సందర్భంగా అనసూయతో కలిసి ఒక స్పెషల్ వీడియోని చేశారు. క్రేజీ కిచెన్ పేరుతో ఒక ఎపిసోడ్ ని చేశారు. ఈ ఎపిసోడ్ లో భాగంగా అనసూయ, సుమ ఇద్దరూ కలిసి ఒక రీల్ చేశారు. ఈ రీల్ లో బాతుల్లా స్టెప్పులేశారు. బాతుల్లా అడుగులో అడుగు వేసుకుంటూ చూడముచ్చటగా కనిపిస్తున్నారు. ఈ రీల్ ని సుమ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక సుమ ఏడాది క్రితం “క్రేజీ కిచెన్” సీజన్ ని స్టార్ట్ చేశారు. అయితే కొన్ని ఎపిసోడ్స్ తర్వాత మధ్యలో ఆపేశారు. తాజాగా అనసూయతో సీజన్ 2 ని స్టార్ట్ చేశారు.