దక్షిణాది చిత్రపరిశ్రమలో దాదాపు గ్లామర్ షోకి దూరంగా ఉంటూ వచ్చిన హీరోయిన్స్ అంతా.. ఈ మధ్య చాలా ఓపెన్ అయిపోతున్నారు. సినిమాలలో ఏమోగానీ సోషల్ మీడియా విషయానికి వచ్చేసరికి కుర్రకారు తట్టుకోలేని స్థాయిలో తమ అందాలతో దాడి చేస్తున్నారు ముద్దుగుమ్మలు.
ఇండస్ట్రీలో గ్లామర్ బ్యూటీ అని పేరున్నా.. బికినీ వేసి సర్ప్రైజ్ చేసిన భామలు చాలా తక్కువ. ఇటీవల బికినీ భామల జాబితాలో కూడా చేరిపోయింది కేరళ కుట్టి అమలాపాల్. ఈ బ్యూటీ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. 2011లో బెజవాడ మూవీతో టాలీవుడ్ లో డెబ్యూ చేసింది.
తెలుగు డెబ్యూకు ముందే అమలాపాల్.. ప్రేమఖైది అనే డబ్బింగ్ సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైంది. నాగచైతన్య సరసన డెబ్యూ మూవీ పెద్దగా వర్కౌట్ కాలేదు. కానీ.. అల్లు అర్జున్ తో ఇద్దరమ్మాయిలతో, రామ్ చరణ్ సరసన నాయక్ సినిమాలతో తెలుగులో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.
అమలాపాల్ కెరీర్ పరంగా తెలుగులో చాలా తక్కువ సినిమాలే చేసింది. ఎందుకంటే.. ఎక్కువగా తమిళ, మలయాళం సినిమాలే చేస్తూ వచ్చింది. ఆ మధ్యలో డైరెక్టర్ ఏఎల్ విజయ్ ని పెళ్లి చేసుకొని కొంతకాలం సినిమాలకు దూరమైంది. పెళ్ళైన మూడేళ్లకే అమలాపాల్, విజయ్ నుండి విడిపోయి మళ్లీ సినిమాలు చేయడం స్టార్ట్ చేసింది.
ఇక పెళ్లికి ముందు డీసెంట్ రోల్స్ చేసిన అమల.. ఎప్పుడైతే విడాకులు తీసుకుందో అప్పటినుండి గ్లామర్ షో స్టార్ట్ చేసేసింది. ఇక సౌత్ సినిమాలు మాత్రమే కాకుండా బాలీవుడ్ లో బోల్డ్ వెబ్ సిరీస్ లు చేసేందుకు రెడీ అయిపోయింది. చాలా గ్యాప్ తర్వాత తెలుగులో 'కుడి ఎడమైతే' అనే వెబ్ సిరీస్ లో కనిపించింది.
ఈ మధ్య గ్లామర్ షోకి హద్దులేవీ పెట్టుకోకుండా సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టి సెగలు రేపుతోంది అమల. రీసెంట్ బికినీ ధరించి థండర్ థైస్ షో చేసిన ఈ అమ్మడు.. తాజాగా మరోసారి బికినీ రేంజ్ స్విమ్ సూట్ ధరించి కుర్రకారులో చిచ్చు రాజేసింది. ఏంటి ఇద్దరమ్మాయిలతో మూవీలో కనిపించిన అమలాపాల్ యేనా అని ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్.
ప్రస్తుతం అమలాపాల్ వెకేషన్ లో ఉంది. బీచ్ లో ఎన్నడూ లేని విధంగా రెచ్చిపోతూ అందాలను షో చేస్తోంది. తాజాగా రెడ్ కలర్ స్విమ్ సూట్ లో అమలా పోస్ట్ చేసిన ఫొటోలు, ఆ ఫోటోలలో అమలా పెట్టిన ఫోజులు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సినిమాల సంగతేమో గాని ఈ ఇలా అందలతో అయినా అలరిస్తుందని ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.
ఇక అమలాపాల్ సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల కడవర్ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను పలకరించింది. ఇప్పుడు అమల చేతిలో మూడు మలయాళం సినిమాలు ఉన్నాయి. అదీగాక రీసెంట్ గా టాలీవుడ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన విషయం విదితమే. మరి ఈ భామ ఇకపై తెలుగులో కనిపిస్తుందో లేదో చూడాలి. అమలాపాల్ కొత్త ఫోటోలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.