గత కొంత కాలంగా సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. సినీ పరిశ్రమకు చెందిన నటులు, దర్శక, నిర్మాతలు, ఇతర సాంకేతిక రంగానికి చెందిన వారు మృత్యువాత పడుతున్నారు. వరుస విషాదాలతో అటు వారి కుటుంబాల్లోనే కాక.. ఇండస్ట్రీలో కూడా తీవ్ర విషాద ఛాయలు అలుముకుంటున్నాయి. తాజాగా మాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది.
ప్రముఖ మాలీవుడ్ దర్శకుడు కేఎన్ శశిధరణ్(72) కన్నుమూశారు. జులై 7 న ఆయన కన్నుమూశారు.. ఈ వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేరళలోని కొచ్చి సమీపంలో ఈడపల్లిలోని తన నివాసంలో ఆయన తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కేఎన్ శశిధరణ్ సతీమణి పేరు వీణ, వీరికి రీతూ, ముఖిల్ సంతానం.చదువుకునే రోజుల్లో చిత్ర పరిశ్రమపై మక్కువతో కేఎన్ శశిధరణ్ పుణె ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో చేరి డిగ్రీ పట్టా అందుకున్నారు.
1984లో అక్కర సినిమాతో మలయాళ ఇండస్ట్రీలో ప్రవేశించారు. మళియాళ సూపర్ స్టార్ మమ్ముట్టితో పాలు స్టార్ హీరోలు ఈ మూవీలో నటించారు. ‘కనతయ పెంకుట్టి’ అనే మర్డర్ మిస్టరీ సినిమాతో ఆయన మంచి పేరు సంపాదించారు. కేఎన్ శశిధరణ్ సినిమాల కంటే ఎక్కువగా వాణిజ్య ప్రకటనలు చేసేవారు. కేఎన్ శశిధరణ్ మృతిపై ప్రముఖ నటులు, దర్శక, నిర్మాతలు సంతాపాన్ని వ్యక్తం చేశారు.
ఇది చదవండి: Ram Pothineni: మెడకు గాయం.. ప్రాణాలకు తెగించి ఆ పనులు చేశా: హీరో రామ్