RRR.. ఓ ఏడాదిన్నర కాలంగా పాన్ ఇండియా ప్రేక్షకులు ఎదురుచూస్తున్న సినిమా. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా.. పీరియాడికల్ పాన్ ఇండియా మల్టీస్టారర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మించిన RRR రిలీజ్ డేట్ మార్చి 25న ఖరారైన సంగతి తెలిసిందే. తాజాగా చిత్రబృందం RRR ప్రమోషన్స్ ప్రారంభించింది. ఈ సందర్భంగా సినిమాలో కొమరం భీమ్ గా నటించిన ఎన్టీఆర్ RRR మూవీ, రాజమౌళి గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయిపోయాడు.‘మీరు సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అయినందుకో.. లేదా ప్రస్తుతం డైరెక్టర్ గా నెం.1 స్థానంలో ఉన్నారని నేను ఈ సినిమా చేయలేదు. ఒక నటుడిని నటుడిగా మరోస్థాయికి తీసుకెళ్లే నటనను రాబట్టగలరని ఈ సినిమా చేశాను. అలాగే మీ పిల్లర్ అయినటువంటి ఎంఎం కీరవాణి గారు.. ఆయనతో నాకు ఇరవై ఏళ్ల అనుబంధం ఉంది’ అంటూ ఎన్టీఆర్ పవర్ ఫుల్ స్పీచ్ ఇచ్చాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మీరు కూడా వీడియో చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.