ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొందరు అత్యుత్సాహం చూపించారు. రీసెంట్ గా జరిగిన తారక్ పుట్టినరోజు వేడుకల్ని భయంకరమైన రీతిలో జరుపుకున్నారు. దీంతో దాదాపు తొమ్మిది మంది అభిమానుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ రెచ్చిపోయారు. అభిమానం చూపించే స్థాయి దాటి వెళ్లిపోయారు. ఫేవరెట్ హీరోపై ఎంత ఇష్టమున్నా సరే దాన్ని ఓ లిమిట్ లో ఉంచుకోవాలి. ఒకవేళ అది క్రాస్ చేస్తే, దాన్ని పిచ్చి పరాకాష్టకు చేరుకోవడం అంటారు. తాజాగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొందరు చేసిన రచ్చ గురించి చెబితే మీరే కూడా ఇది నిజమేనని అంటారు. ఎందుకంటే సదరు అభిమానులు చేసిన పని ఇప్పుడు పోలీసు స్టేషన్ వరకు చేరుకుంది. కొందరు అభిమానుల్ని అరెస్ట్ కూడా చేశారు. ఇంతకీ ఏం జరిగింది? ఏంటి సంగతి?
ఇక వివరాల్లోకి వెళ్తే.. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ బేస్ చాలా ఎక్కువ. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలో అతడికి కోట్లాదిమంది అభిమానులున్నారు. సినిమాలు ఏవి రిలీజైనా సరే ఆ రాష్ట్రంలోనూ గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. తాజాగా తారక్ పుట్టినరోజు వేడుకల్ని అలానే జరుపుకొన్నారు. కానీ హద్దులు దాటేశారు. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఎన్టీఆర్ హీరోగా చేస్తున్న మూవీ ‘దేవర’. రీసెంట్ గా ఇతడి పుట్టినరోజు సందర్భంగా టైటిల్ లుక్ తోపాటు పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఇందులో ఎన్టీఆర్ కత్తిపట్టుకుని ఉన్న గెటప్ లో కనిపించాడు. ఇప్పుడు దీన్నే రియల్ లైఫ్ లో అభిమానులు స్ఫూర్తిగా తీసుకున్నారు.
గ్రేట్ ఆంధ్ర కథనం ప్రకారం.. కర్ణాటకలో రాబర్ట్ సన్ లోని ఓ థియేటర్ బయట ఉన్న ఎన్టీఆర్ ‘దేవర’ కటౌట్ కి ఫ్యాన్స్ రక్తాభిషేకం చేశారు. అంటే రెండు మేకల్ని అక్కడే చంపి వాటి రక్తాన్ని ఎన్టీఆర్ పోస్టర్ పై పూశారు. ఆ తర్వాత మేకల బాడీల్ని అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోయారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడి పోలీసుల దగ్గరికి చేరుకుంది. దీంతో దర్యాప్తు చేసి ఏకంగా తొమ్మిది మంది ఫ్యాన్స్ ని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ విషయం కాస్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది. మరీ ఇలా తయారయ్యారేంట్రా బాబు అని నెటిజన్స్ సదరు ఫ్యాన్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. మరి ఎన్టీఆర్ కటౌట్ కి రక్తంతో అభిషేకం చేయడంపై మీరేం అనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి.