ఈ మద్య టాలీవుడ్ ఇండస్ట్రీలో బాలీవుడ్ నటులు భలే సందడి చేస్తున్నారు. ఇప్పటికే జాకీ ష్రఫ్, సంజయ్ దత్, అక్షయ్ కుమార్ తో పాటు ఇప్పుడు సైఫ్ అలీఖాన్ కూడా ఎంట్రీ ఇస్తున్నారు.
తెలుగు ఇండస్ట్రీలో అతి తక్కువ మంది దర్శకులు మాత్రమే తక్కువ సమయంలో ఎక్కువ పాపులారిటీ సంపాదించింది. అలాంటి వారిలో కొరటాల శివ ఒకరు. రచయితగా కెరీర్ ఆరంభించిన ఆయన మిర్చి సినిమాతో దర్శకుడిగా మారాడు. ఆ తర్వాత శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను మూవీస్ తో వరుస విజయాలు అందుకొని స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన ‘ఆచార్య’ మూవీ అనుకున్నంత విజయం సాధించకపోవడంతో తన తదుపరి చిత్రం ‘దేవర’పై గట్టి ఫోకస్ పెట్టారు కొరటాల. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ‘దేవర’పై ఫ్యాన్స్ కూడా భారీ అంచనాలు పెంచుకున్నారు. తాజాగా దేవర మూవీ నుంచి కొత్త అప్ డేట్ వచ్చింది.
ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్, మోహన్ లాల్ నటించిన ‘జనతా గ్యారేజ్’ బిగ్గెస్ హిట్ గా నిలిచింది. ఈ మూవీ తర్వాత ఎన్టీఆర్ తో కలిసి కొరటాల శివ ‘దేవర’ మూవీ తెరెక్కిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న దేవరపై భారీగానే అంచనాలు ఉన్నాయి. ఈ మూవీలో అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుంది. మరో కీలక పాత్రలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ నుంచి కొత్త అప్ డేట్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ రోజుల సైఫ్ అలీఖాన్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన క్యారెక్టర్ రివీల్ చేస్తూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్ లో సైఫ్ లుక్ నందమూరి అభిమానుల్లో ఉన్న అంచనాలు పెరిగిపోతున్నాయి.
దేవర మూవీలో సైఫ్ అలీకాన్ బైర పాత్రతో నెగిటీవ్ షేడ్స్ లో పవర్ ఫుల్ రోల్ చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. దానికి తగ్గట్టుగానే ఫస్ట్ లుక్ లో చాలా రఫ్ గా సీరియస్ గా చూస్తున్న ఫోటో రిలీజ్ చేశారు. బ్యాగ్ గ్రౌండ్ లో ఎత్తైన కొండలు, సముద్రం, పడవలు చూపిస్తున్నారు. మొత్తానికి సినిమా సముద్రం బ్యాక్ డ్రాప్ తో నడుస్తుందనే విషయాన్ని మరోమారు స్పష్టం చేశారు చిత్ర యూనిట్. ఈ మూవీ నుంచి ఇప్పటి వరకు ఎన్టీఆర్, హీరోయిన్ జాన్వి కపూర్ ఫస్ట్ లుక్స్ రిలీజ్ అయ్యాయి. ప్రస్తుతం మూవీ షూటింగ్ షరవేగంగా నడుస్తుంది. యువసుధ ఆర్ట్స్ బ్యానర్ పై మిక్కిలినేని సుధాకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కల్యాణ్ రామ్ సహ-నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ట్విట్టర్ వేధికగా సైఫ్ కి బర్త్ డే విషెస్ చెప్పారు జూనియర్ ఎన్టీఆర్.
BHAIRA
Happy Birthday Saif sir !#Devara pic.twitter.com/DovAh2Y781
— Jr NTR (@tarak9999) August 16, 2023