తెలుగు ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో ఎన్టీఆర్. సీనియర్ ఎన్టీఆర్ బ్రహ్మర్షి విశ్వామిత్ర చిత్రంలో బాలనటునిగా హిందీ చిత్రసీమకు పరిచయం చేశాడు. ఆ తర్వాత నిన్ను చూడాలని చిత్రంతో హీరోగా మారాడు. తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన స్టూడెంట్ నెం.1 చిత్రంతో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్నాడు. అప్పటి నుంచి ఎన్టీఆర్ మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. రాజమౌళి దర్శకత్వంలో సింహాద్రి, యమదొంగ తర్వాత ఆర్ఆర్ఆర్ మూవీలో నటించాడు ఎన్టీఆర్. ఈ చిత్రం ప్రపంచ స్థాయిలో బ్లాక్ బస్టర్ విజయం అందుకోవడమే కాదు.. కలెక్షన్ల వర్షం కురిపించింది. ఎన్నో అవార్డులు అందుకుంది. తాజాగా ఆర్ఆర్ఆర్ మూవీ నుంచి నాటు నాటు సాంగ్ కి గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు చిత్ర యూనిట్ కి అభినందలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేశాడు.
ఈ వీడియోలో ఎన్టీఆర్ మాట్లాడుతూ.. నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడం ఎంతో సంతోషంగా ఉంది. తెలుగు ఇండస్ట్రీలో కిరవాణి లాంటి సంగీత దర్శకుడు లభించడం ఎంతో అదృష్టం.. ఆయన ఎన్నో అద్భుదమైన పాటలు అందించారు. ముఖ్యంగా నా కెరీర్ లో ఆయన ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చారు. దేశం గర్వించే విధంగా తెలుగు చిత్రంలో ఒక సాంగ్ కి గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడం వెనుక కిరవాణి కష్టం ఎంతో ఉంది.. ఆయనకు నా హృదయపూర్వక అభినందనలు. అలాగే ఆర్ఆర్ఆర్ మూవీకి ఇంతటి ఘన విజయాన్ని అందించిన ప్రతి ఒక్కరికీ నా పాదాభివందనం.
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ మూవీ ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది.. అంతకు మించి సూపర్ డూపర్ హిట్ అయ్యింది. స్నేహబంధం గురించి ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో నాటు నాటు సాంగ్ కి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. యావత్ భారత దేశంలో మంచి రెస్పాన్స్ వచ్చింది.. ఎక్కడ చూసినా ఆ పాటే మారుమోగుతుంది. అదేవిధంగా ఆస్కార్ తర్వాత ప్రపంచ సినీరంగంలో అత్యున్నత పురస్కారంగా గోల్డెన్ గ్లోబ్ అవార్డును భావిస్తుంటారు. అలాంటి గొప్ప అవార్డు మన తెలుగు మూవీ ‘ఆర్‌ఆర్‌ఆర్’ లోని పాట గెలవడంపై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ పాట ఆస్కార్ అవార్డు కి షార్ట్ లీస్ట్ సైతం అయినట్లు ఇండస్ట్రీ టాక్. తాజాగా ఎన్టీఆర్ మాట్లాడిన వీడియో వైరల్ అవుతుంది.
Our Bheem aka @tarak9999 congratulated Music Director @mmkeeravaani for winning the #GoldenGlobes award and thanked the audience for their constant love and support towards #RRR #RRRforOscars #RRRRoar #Tarak #JrNTR pic.twitter.com/7iMHPFWI1M
— YouWe Media (@MediaYouwe) January 12, 2023