నిన్న మొన్నటి వరకూ నివేత పేతురాజ్ అంటే పద్ధతైన హీరోయిన్ అని ఒక టాక్ ఉండేది. ఇప్పుడు ఆ టాక్ లేదు. వేరే టాక్ నడుస్తోంది. మెంటల్ మదిలో, చిత్రలహరి, బ్రోచేవారెవరురా, అల వైకుంఠపురములో వంటి సినిమాల్లో చాలా పద్దతిగా కనిపించింది. విజయ్ ఆంటోనీ సినిమా ఒకటుంది. సమయానికి గుర్తొచ్చి సావదు. అదే పోలీస్ గా నటించిన సినిమా. రోషగాడు సినిమా. ఈ సినిమాలో నడుము అందం చూపించి కవ్వించింది. మరీ చూపించకపోతే హీరోయిన్ గా మన్నలేమనుకుందో, మరేమనుకుందో తెలియదు గానీ ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే అనేలా బ్యాక్ చూపించి బెండ్ తీసింది. ఇప్పుడు అంతకు మించి బొమ్మ చూపిస్తుంది. విశ్వక్ సేన్ నటించిన ‘దాస్ కా ధమ్కీ’ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.
గతంలో విశ్వక్ సేన్ తో కలిసి పాగల్ సినిమాలో నటించింది. అప్పుడు, ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు అందాల ధమ్కీ ఇస్తోంది. ‘ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల’ వీడియో సాంగ్ ని రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ సాంగ్ లో నివేత ఒలకబోసిన గ్లామర్ కి కుర్రాళ్ళు పిచ్చెక్కిపోతున్నారు. విశ్వక్ సేన్, నివేత మధ్య కెమిస్ట్రీ సబ్జెక్ట్ బాగా వర్కవుట్ అయినట్లు కనబడుతోంది. మునుపెన్నడూ లేని విధంగా పొట్టి బట్టల్లో కాకరేపుతుంది. బీచ్ దగ్గర క్లీవేజ్ షోతో కిక్కెక్కిస్తోంది. సాంగ్ చూస్తుంటే సినిమాలో రొమాన్స్ పాళ్ళు చాలా ఎక్కువగానే ఉన్నట్టు తెలుస్తోంది. విశ్వక్ సేన్ కి ఆల్మోస్ట్ పడిపోయిందో లేదో ఏమో గానీ.. సాంగ్ చూసిన యూతు గాళ్ళకి మాత్రం గుండె జారి కింద పడిపోయింది.
యూత్ ని మాత్రం ఆల్మోస్ట్ పడగొట్టేసింది పిల్ల. తన అందాల మత్తులో పడేసి చిత్తు చిత్తు చేస్తుంది. ఈ సాంగ్ లో నివేతని చూస్తే నిద్ర పట్టదేమో జనాలకి. అంతలా తన గ్లామర్ ట్రీట్ తో మతిపోగొడుతోంది. పాన్ ఇండియా మూవీ కాబట్టి అందరి కళ్ళలో పడచ్చునన్న ఉద్దేశంతో గ్లామర్ డోస్ పెంచిందో లేక మామూలుగానే పెంచిందో తెలియదు గానీ ఈ సినిమా హిట్ అయితే నివేత ఒక మెట్టు ఎక్కేసినట్టే. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా 2023 లో ఫిబ్రవరి 17న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ సినిమాకి విశ్వక్ సేన్ దర్శకత్వం వహించారు. ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల సాంగ్ చూసాక మీకేమనిపిస్తుంది. మీకు కూడా అందాల ధమ్కీ ఇచ్చినట్టు అనిపించిందా? లేదా? మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి.