విశ్వక్ నుంచి ఉగాది కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం 'దాస్ కా ధమ్కీ' విడుదలైన తొలి రోజే విశ్వక్ సేన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ను రాబట్టింది. ఇక ఈ సినిమా త్వరలోనే ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఎప్పటి నుంచి అంటే?
విశ్వక్ సేన్ హీరోగా నటించిన చిత్రం "దాస్ కా ధమ్కీ". విశ్వక్ సేన్ స్వీయదర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమాలో.. నివేద పేతురాజ్ హీరోయిన్ గా నటించింది. వరుసపెట్టి హిట్లు కొడుతూ.. మంచి ఊపు మీద ఉన్న విశ్వక్ సేన్ తొలిసారిగా పాన్ ఇండియా లెవెల్ లో తన సినిమా రిలీజ్ చేశాడు. ఈ సినిమాకు సంబంధించిన మూడు రోజుల కలక్షన్స్ ఎలా ఉన్నాయో తాజాగా ప్రకటించేశారు.
ఇండస్ట్రీలో వరుస సక్సెస్ లతో ఫామ్ లో ఉన్న హీరోయిన్స్.. ఇండస్ట్రీకి దగ్గరలో షూటింగ్స్ కి అనువుగా ఉండేలా ఫ్లాట్స్ కొనుక్కోవడం గురించి వింటూనే ఉంటాం. ఒక్కోసారి తాము కొత్తగా ఫ్లాట్, ఇల్లు కొనుగోలు చేసిన విషయాన్ని స్వయంగా వారే ప్రకటిస్తుంటారు. తాజాగా టాలీవుడ్ లో హీరోయిన్ గా రాణిస్తున్న ఓ బ్యూటీ.. హైదరాబాద్ లో కాకుండా ముంబైలో ఇల్లు కొన్నానని చెప్పి సర్ప్రైజ్ చేసింది.
నిన్న మొన్నటి వరకూ నివేత పేతురాజ్ అంటే పద్ధతైన హీరోయిన్ అని ఒక టాక్ ఉండేది. ఇప్పుడు ఆ టాక్ లేదు. వేరే టాక్ నడుస్తోంది. మెంటల్ మదిలో, చిత్రలహరి, బ్రోచేవారెవరురా, అల వైకుంఠపురములో వంటి సినిమాల్లో చాలా పద్దతిగా కనిపించింది. విజయ్ ఆంటోనీ సినిమా ఒకటుంది. సమయానికి గుర్తొచ్చి సావదు. అదే పోలీస్ గా నటించిన సినిమా. రోషగాడు సినిమా. ఈ సినిమాలో నడుము అందం చూపించి కవ్వించింది. మరీ చూపించకపోతే హీరోయిన్ గా మన్నలేమనుకుందో, […]
హీరోహీరోయిన్లను విపరీతంగా అభిమానించే కల్చర్ మన దగ్గర చాలా ఎక్కువ. చిన్న హీరోనా పెద్ద హీరోయిన్ అనే తేడా అసలే ఉండదు. ఓ మంచి, అందులో అద్భుతమైన యాక్టింగ్ చేస్తే.. ప్రేక్షకులు గుండెల్లో పెట్టేసుకుంటారు. గుడి కట్టినాసరే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఇక సోషల్ మీడియా ట్రెండ్ బాగా పెరిగిపోయిన ఈ కాలంలో.. సదరు హీరోయిన్లకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఎప్పటికప్పుడు ఇన్ స్టాలో షేర్ చేస్తూనే ఉంటారు. అప్పుడప్పుడు సదరు యాక్టర్స్ చిన్నప్పటి ఫొటోలు కూడా బయటకొస్తుంటాయి. […]
ఎన్టీఆర్– రామ్ చరణ్– రాజమౌళి కాంబోలో ‘RRR’ సినిమా వెయ్యి కోట్ల క్లబ్ లో చేరి.. బాక్సాఫీస్ వద్ద ఇంకా దూసుకుపోతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు ట్రిపులార్ సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు. ఎన్టీఆర్- రామ్ చరణ్ ఇద్దరి నట విశ్వరూపానికి ఈ సినిమా సాక్ష్యంగా నిలుస్తుంది. అయితే గతంలో ఎన్టీఆర్ నటకు అవార్డు వస్తుందంటూ ఓ క్రిటిక్ చేసిన వ్యాఖ్య సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపింది. మా హీరో గొప్ప అంటే మా […]
కెరీర్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న యువ హీరో విశ్వక్ సేన్. ఈయన తాజాగా నటించిన పాగల్ మూవీ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ సినిమాతో థియేటర్స్ తెరిపిస్తా. సినిమా ఆడకుంటే పేరు మార్చుకుంటా అని శపథం కాసి మరీ ఈ మూవీని రిలీజ్ చేశాడు విశ్వక్. మరి.. పాగల్ మూవీ విశ్వక్ సేన్ నమ్మకాన్ని నిలబెట్టిందా? విశ్వక్ కి కొత్త పేరు పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా చేసిందా? ఈ విషయాలన్నీ రివ్యూ ద్వారా […]
విశ్వక్ సేన్.. తెలుగు చిత్రపరిశ్రమలో ఈ మధ్యకాలంలో బాగా వినిపిస్తున్న పేరు. తన నటన, హావభావాలతోనే కాకుండా సినిమాపై తనదైనశైలిలో స్పందిస్తూ విశ్వక్ వార్తల్లో నిలుస్తుంటాడు. రేపు పాగల్ గా ప్రేక్షకుల ముందుకు రానున్న విశ్వక్ రెండ్రోజులుగా తన కామెంట్లతోనూ వార్తల్లో నిలుస్తున్నాడు. ముందుగా సినిమా విషయానికి వస్తే లక్కీ మీడియా బ్యానర్లో రాబోతున్న చిత్రం పాగల్. ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి మరో డైరెక్టర్ పరిచయం కాబోతున్నాడు. పాగల్ సినిమాకి కథ, దర్శకత్వం వహిస్తున్న నరేష్ […]
స్వశక్తిని నమ్ముకుని ఇండస్ట్రీలో స్టార్ డమ్ అందుకున్న అతికొద్ది మంది హీరోలలో విశ్వక్ సేన్ ఒకరు. “ఈ నగరానికి ఏమైంది”, “హిట్” చిత్రాలతో విశ్వక్ తనని తాను నిరూపించుకున్నాడు. ఇక ఇప్పుడు పాగల్ మూవీతో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్దమయ్యాడు విశ్వక్. దిల్ రాజు సమర్పణ లో నరేష్ కుప్పిలి పాగల్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. విశ్వక్ సేన్ సరసన సిమ్రాన్ చౌదరీ, నివేథా పేతురాజ్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రం ఆగస్ట్ 14 వ తేదీన […]