ఎన్టీఆర్– రామ్ చరణ్– రాజమౌళి కాంబోలో ‘RRR’ సినిమా వెయ్యి కోట్ల క్లబ్ లో చేరి.. బాక్సాఫీస్ వద్ద ఇంకా దూసుకుపోతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు ట్రిపులార్ సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు. ఎన్టీఆర్- రామ్ చరణ్ ఇద్దరి నట విశ్వరూపానికి ఈ సినిమా సాక్ష్యంగా నిలుస్తుంది. అయితే గతంలో ఎన్టీఆర్ నటకు అవార్డు వస్తుందంటూ ఓ క్రిటిక్ చేసిన వ్యాఖ్య సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపింది. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ ఫ్యాన్స్ మొత్తం సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే చేశారు. అయితే అలాంటి ప్రశ్నే హీరోయిన్ నివేథ పేతురాజుకు ఎదురైంది.
ఇదీ చదవండి: వీడియో: చిరంజీవిని డైరెక్ట్ చేసే ఆఫర్ వచ్చింది! ఉపేంద్ర ఎమోషనల్ స్పీచ్!
ఇన్ స్టాగ్రామ్ లో ఆస్క్ మీ ఏ క్వశ్చన్ అంటూ పేతురాజు అభిమానులను అడిగింది. ఆ సమయంలో ఓ ఫాలోవర్ ‘ఎన్టీఆర్- రామ్ చరణ్లో ఎవరు బెస్ట్ యాక్టర్’ అంటూ క్వశ్చన్ అడిగాడు. ఆ ప్రశ్నకు నివేథ పేతురాజు సీరియస్ అయ్యింది. అతనికి గట్టిగానే బుద్ధి చెప్పింది. మీలాంటి వాళ్ల వల్లే యుద్ధాలు జరుగుతాయనే కోణంలో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ‘ఉక్రెయిన్- రష్యా యుద్ధం మెదలు పెట్టింది మీరే కదా?’ అంటూ ప్రశ్నించింది. అలా మాట్లాడే వారి వల్లే ఇండస్ట్రీ, ఫ్యాన్స్ మధ్య గొడవలు జరుగుతున్నాయని అర్థం వచ్చేలా నివేథ పేతురాజ్ ఇచ్చిన కౌంటర్ పై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నివేథ పేతురాజు వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.