Nithya Menon: హీరోయిన్ నిత్యా మీనన్ అవార్డు విన్నింగ్ నటనకు పెట్టింది పేరు. దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రధాన భాషల్లో ఆమె నటించారు. ఇప్పటివరకు దాదాపు 50కిపైగా సినిమాలు చేశారు. వీటిలో ఆమె ఉత్తమ నటనకు గానూ 3 ఫిల్మ్‌ఫేర్, రెండు నందులతో పాటు పలు అవార్డులు సొంతం అయ్యాయి. నిత్యా మీనన్ ప్రస్తుతం సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లలోనూ నటిస్తున్నారు. తాజాగా, ఆమె నటించిన వెబ్ సిరీస్ ‘ మోడ్రన్ లవ్ హైదరాబాద్’ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆమెను చూసి అభిమానులు షాక్ అయ్యారు. అసలు నడవలేని స్థితిలో ఉన్న ఆమెను చూసి బాధపడ్డారు. చేతిలో స్టిక్‌తో, పక్కన ఇద్దరు బాడీగార్డులు సపోర్టు రాగా కుంటుకుంటూ నడిచారామె. ట్రైలర్ లాంచ్ సందర్భంగా తన కాలుకు అయిన గాయం గురించి నిత్యా చెప్పుకొచ్చారు.
ఆమె మాట్లాడుతూ.. ‘‘ ఫిల్మ్‌లో కూడా ఇదే సేమ్. నా క్యారెక్టర్ అంటే ఇదే. నాకు మోకాలు గాయం అయిఉంటుంది. అప్పుడు ఫస్ట్ టైం మోకాలికి గాయం అయితే ఎలా నడుస్తారో ట్రై చేశాను. ఇప్పుడు నిజంగానే చేస్తున్నా.. రెండు రోజుల క్రితం మెట్ల మీదనుంచి జారి కిందపడ్డా. సేమ్ అదే మోకాలుకు దెబ్బ తగిలింది’’ అని చెప్పారు. నిత్యా మీనన్ స్టిక్‌తో నడుస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై స్పందిస్తున్న అభిమానులు, నెటిజన్లు.. నిత్యా త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. మరి, నిత్యా మీనన్ మోకాలి గాయం త్వరగా నయం కావాలని కోరుకుంటూ మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Ranveer Singh: ‘మ్యాన్ vs వైల్డ్’ బేర్ గ్రిల్స్ తో రన్వీర్ సింగ్ సాహసాలు.. ప్రోమో వైరల్!