నిత్యా మీనన్ చిత్ర పరిశ్రమలో తనకు ఎదురైన చేదు అనుభవం గురించి చెప్పుకొచ్చారు. ఓ సినిమా షూటింగ్‌లో హీరో తనతో తప్పుగా ప్రవర్తించాడని తెలిపింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్లు వైరల్‌గా మారాయి.
ఎంతోమంది పరభాషా నటీమణులు తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చి తమ సత్తా చూపిస్తున్నారు. అలాంటి వారిలో నిత్యామీనన్ ఒకరు. ఈ కేరళ కుట్టి నటనతోనే కాకుండా సింగింగ్‌తో టాలెంట్‌తో కూడా ప్రేక్షకులను అలరింపజేస్తున్నారు. ఈ అమ్మడు కొన్ని సినిమాల్లో పాటలు కూడా పాడింది. తెలుగు, మళయాళంతో పాటు తమిళ్ సినిమాల్లో కూడా నటిస్తోంది. నిత్యామీనన్ అలా మెుదలైంది సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవటంతో వరుసగా తెలుగులో అవకాశాలు అందుకుంది ఈ చిన్నది. రీసెంట్‌గా భీమ్లానాయక్ సినిమాలో పవన్ కళ్యాణ్ భార్య పాత్రలో నటించి.. ప్రేక్షకులను తన యాక్టింగ్ తో మరింత ఆకట్టుకుంది.
ప్రస్తుతం నిత్యామీనన్ పలు ప్రాజెక్టులతో బీజీ గా ఉంది. అలాగే ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా నిర్వహిస్తున్న ఇండియన్ ఐడల్ సింగింగ్ షోలో నిత్యా జడ్జీ గా వ్యవహరిస్తోంది. ఇక, అసలు విషయానికి వస్తే.. నిత్యామీనన్ క్యాస్టింగ్ కౌచ్‌పై చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇండస్ట్రీలో ఇప్పటికే చాలా మంది నటులు క్యాస్టింగ్ కోచ్ పై స్పందించిన విషయం తెలిసిందే. చాలా మంది హీరోయిన్లు మీడియా ముందు, పలు ఇంటర్వ్యూల్లో తమకు ఎదురైనా చేదు అనుభవాల గురించి చెప్పుకొచ్చారు.
అలానే నిత్యామీనన్ కూడా తాజాగా క్యాస్టింగ్ కోచ్ పై స్పందించింది. ఇక ఈ కేరళ కుట్టీ పెళ్లి గురించి కూడా వార్తలు తెగ వైరల్ అయిపోతున్నాయి. పెళ్లి వార్తపై కూడా నిత్యామీనన్ స్పందించి.. ఇప్పుడే కాదు.. ఆ విషయంపై కూడా క్లారిటీ ఇస్తాను అని చెప్పుకొచ్చింది. క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ.. ‘‘కామంధులు మాత్రం అన్ని రంగాల్లోను ఉంటారు. నాకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎలాంటి ఇబ్బందులు లేవు. కానీ, తమిళంలో మాత్రం ఓ సినిమా షూటింగ్ చేసే సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. నన్ను మాత్రం ఓ హీరో బాగా వేధించాడు. ఆ క్రమంలోనే అసభ్యంగా తాకుతూ పిచ్చి పిచ్చిగా ప్రవర్తించాడు’’ అని చెప్పుకొచ్చింది. నిత్య చెప్పిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.