Nithya Menon: ఇండియన్ సినిమాలో బహుముఖ ప్రజ్ఞ కలిగిన హీరోయిన్స్ అతి కొద్ది మంది మాత్రమే ఉన్నారు. అలాంటి వారిలో మలయాళ కుట్టి ‘నిత్యామీనన్’ ఒకరు. నటిగా, సింగర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా ఆమె తనను తాను నిరూపించుకున్నారు. ప్రముఖ దర్శకురాలు నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ‘‘ అలా మొదలైంది’’ సినిమాతో నిత్యామీనన్ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ సినిమాల్లోనూ నటించారు. ఇప్పటి వరకు 50కి పైగా సినిమాల్లో నటించారు. నిత్యామీనన్‌కు నటన కొత్త కాదు 10 ఏళ్ల వయసులోనే ఆమె సినిమాల్లోకి వచ్చారు.
చైల్డ్ ఆర్టిస్ట్‌గా 1998లో వచ్చిన ‘హనుమాన్’ సినిమాలో నటించారు. ప్రెంచ్-ఇండియన్ ఫిల్మ్ డైరెక్టర్ ఫెడ్రిక్ ఫోజియా దర్శకత్వం వహించిన ఆ సినిమాలో టబుకు చెల్లెలిగా చేశారు. ఈ సినిమా ‘‘సినీ క్వెస్ట్ ఫిల్మ్ ఫెస్టివల్’’లో అవార్డును గెలుచుకుంది. ఇక, ఆ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ నిత్యామీనన్‌కు ఇప్పటి నిత్యా మీనన్‌కు ఫేస్కట్లో పెద్ద తేడా లేదు. ఆమెను చూడగానే ఇట్టే గుర్తుపట్టేయొచ్చు. ప్రస్తుతం నిత్యామీనన్ పాత వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : హీరో ఉదయ్ కిరణ్ ఆత్మహత్యపై సినీ నటి సదా ఓపెన్ కామెంట్స్!