మెగాడాటర్ నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టీవీలో ‘ఢీ’ షో యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈమె.. అక్కడ సక్సెస్ అయింది. ఆ తర్వాత షార్ట్ ఫిల్మ్స్ తో బాగా ఫేమస్ అయింది. ఇక సినిమాల్లో హీరోయిన్ గా అడుగుపెట్టి లక్ పరీక్షించుకుంది. కానీ అనుకున్నంతంగా సక్సెస్ కాలేకపోయింది. ఇక ప్రస్తుతం నటిగా కంటే నిర్మాతగా చాలా బిజీగా మారిపోయింది. ఓవైపు సినిమాలు, సిరీసులు అంటూ బిజీగా ఉన్నప్పటికీ.. విదేశాలకు టూర్స్ వేస్తూ ఫుల్ చిల్ అవుతోంది. అందుకు సంబంధించిన ఫొటోలని కూడా పోస్ట్ చేస్తూ నెటిజన్స్ కి ఎప్పుడూ టచ్ లో ఉంటోంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. నిహారిక, గత వారం పదిరోజులుగా టర్కీలోనే ఉంది. ఈ మధ్యనే ఓ టర్కిష్ భామతో కలిసి స్విమ్మింగ్ పూల్ దిగిన ఫొటోని షేర్ చేసింది. అందులో నిహారిక బికినీలో ఉంది. ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ కూడా అయింది. రీసెంట్ టైంలో వరసగా టూర్స్ వేస్తున్న నిహారిక.. గత కొన్నాళ్ల నుంచి మాత్రం టర్కీలో సమయాన్ని ఆస్వాదిస్తోంది. అందుకు సంబంధించిన వీడియో, ఫొటోలని షేర్ చేస్తోంది. ఇప్పటికే అక్కడి నుంచి రాలేకపోతున్నానని చెప్పింది. ‘ఇప్పటికీ అలసిపోలేదు’ అని క్యాప్షన్ తో ఓ వీడియోని పోస్ట్ చేసింది.
నాగశౌర్య హీరోగా నటించిన ‘ఒక మనసు’ సినిమాతో నిహారిక హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘హ్యాపీ వెడ్డింగ్’, ‘సూర్యకాంతం’ లాంటి సినిమాలు చేసింది. అన్నీ కూడా బాక్సాఫీస్ దగ్గర మిక్స్ డ్ టాక్ తెచ్చుకున్నాయి. ఇక మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ లో చేసిన ‘సైరా నరసింహారెడ్డి’లోనూ అతిథి పాత్రలో అలా మెరిసింది. ఇక లాక్ డౌన్ టైంలో చైతన్య జొన్నలగడ్డని పెళ్లి చేసుకున్న నిహారిక.. పూర్తిగా నటనకు స్వస్తి పలికింది. ఆ తర్వాత నిర్మాతగా మారి.. ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’, ‘హలో వరల్డ్’ లాంటి వెబ్ సిరీస్ లకు నిర్మాతగా వ్యవహరించింది. ప్రస్తుతం అటు వెకేషన్స్, ఇటు ప్రొడ్యసర్ గా బిజీగా మారుతూ ఎప్పుడూ సోషల్ మీడియాలో ఉంటోంది. మరి నిహారిక టర్కీ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ పోస్ట్ చేయండి.