టాలీవుడ్ లో కొత్తగా అడుగుపెడుతున్న హీరోల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. కొత్తగా వచ్చేవారు వస్తున్నారు. మెల్లగా ఇండస్ట్రీలో సెటిల్ అయ్యేవారు అవుతున్నారు. అయితే.. ఇండస్ట్రీలో స్టార్ ఫ్యామిలీకి సంబంధించి ఎవరైనా హీరో కటౌట్ తో కనిపిస్తే చాలు.. ఎప్పుడెప్పుడు డెబ్యూ చేస్తారా అని వెయిట్ చేస్తుంటారు ప్రేక్షకులు. కొంతకాలంగా ఈ జాబితాలో కంటిన్యూ అవుతున్న వారిలో మెగా బ్రదర్ నాగబాబు అల్లుడు, నిహారిక భర్త చైతన్య జొన్నలగడ్డ.
నిహారికతో పెళ్లి తర్వాత చైతన్య హీరోగా డెబ్యూ చేయబోతున్నాడని, లేదా ప్రొడ్యూసర్ గా సినిమాలు తీయబోతున్నాడని పలు వార్తలు వైరల్ అయ్యాయి. అయితే.. ఈ వార్తలపై నిహారిక, చైతన్య ఎప్పుడూ స్పందించలేదు. కానీ.. సోషల్ మీడియాలో ఇద్దరు యాక్టీవ్ గానే ఉంటున్నారు. ఈ క్రమంలో ఇద్దరు స్పందించకపోయేసరికి చైతన్య నిజంగానే సినిమాల్లోకి రాబోతున్నాడని వార్తలు ముమ్మరం అయిపోయాయి. దీంతో తాజాగా ఈ విషయంపై చైతన్య రెస్పాండ్ అయినట్లు తెలుస్తుంది.
తనకు యాక్టర్ అవ్వడం ఇష్టం లేదని.. ప్రస్తుతం ఉన్నటువంటి బిజినెస్ లతో సంతృప్తిగానే ఉన్నట్లు తెలిపాడని సినీవర్గాలు చెబుతున్నాయి. దీంతో చైతన్యకు సినిమాల్లోకి వచ్చే ఇంటరెస్ట్ లేదనే విషయం స్పష్టమైందని చెప్పకనే చెప్పాడని ఇండస్ట్రీ టాక్. ఇకనైనా చైతన్య సినీ ఎంట్రీపై వస్తున్న రూమర్స్ కి బ్రేక్ పడుతుందేమో చూడాలి. మరి నిహారిక భర్త చైతన్య సినీ ఎంట్రీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.