కెరీర్ బాగుంటే సెట్స్‌లోకి అడుగుపెడతారు. అవకాశాలు తగ్గిపోతే పెళ్లి పీటలెక్కుతుంటారు హీరోయిన్లు. ఇండస్ట్రీలో ఎవరికైనా ఈ పరిస్థితి కామన్. నిన్న మొన్నటి వరకు హీరోయిన్ అంజలి పరిస్థితి కూడా ఇంతే అనుకున్నారు ఇండస్ట్రీ పీపుల్. అమ్మడు ఏ క్షణమైనా తలంబ్రాలు పోసుకోవచ్చు అనుకునేలోపే ఆమెకి పవన్ కళ్యాణ్ రూపంలో అదృష్ఠం తలుపుతట్టింది. కట్ చేస్తే ఇప్పుడు వరుస సినిమాలతో బిజీ అయ్యింది అంజలి. రాజోలు బ్యూటీ అంజలితో అదృష్టం అష్టాచెమ్మా ఆడుకుంటోంది. అప్పుడెప్పుడో ఫోటో సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ చిన్నదానికి చాలా ఏళ్ల దాకా అస్సలు కలిసిరాలేదు. ఆ తర్వాత షాపింగ్ మాల్ మూవీతో కాస్త కెరీర్ టర్న్ అయింది. ఇక జర్నీ సినిమాతో అమ్మడి జాతకమే మారిపోయింది. దీంతో అంజలి దూసుకుపోవడం ఖాయం అనుకున్నారంతా. కానీ.. అనూహ్యంగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు తర్వాత అదృష్టమే తలుపుతట్టలేదు.
దీంతో అమ్మడిపని అయిపోయినట్టే, ఇక పెళ్లిపీఠలు ఎక్కడమే ఆలస్యం అన్న వార్తలు వచ్చాయి. కానీ మళ్లీ కెరీర్ గారినపడటంతో ఈమెకి కొన్ని అవకాశాలు వచ్చాయి. తరువాత తెలుగులో మాత్రమే కాకుండా.., తమిళ కన్నడ, భాషలలో కూడా సినిమాలు చేస్తూ ముందుకు సాగింది అంజలి. అయితే ఈ గ్యాప్‌లోనే గీతాంజలి మూవీతో మళ్లీ దశ తిరిగిపోయింది. దీంతో.., మరోసారి మ్యారేజ్ మేటర్ అటకెక్కింది. అయితే ఆ సినిమా తర్వాత మళ్లీ సక్సెస్ అన్నదే కనిపించలేదు. దీంతో ఈసారి పెళ్లి ఖాయమే అనుకున్నారంతా. కానీ అనూహ్యంగా వకీల్‌సాబ్ మూవీతో మళ్లీ కమ్ బ్యాక్ ఇచ్చింది ఈ తెలుగమ్మాయి.
నిజానికి ఎవరైనా హీరోయిన్ కు కాస్త వయసు వచ్చింది అంటే చాలు.. పెళ్లి విషయం హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు అంజలి పెళ్లి గురించి కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే… ఇటీవలే తన పెళ్లి పై క్లారిటీ ఇచ్చింది రాజోలు భామ. అందరూ హీరోయిన్స్ చెప్పే రోటీన్ డైలాగులే చెబుతోంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం తన పూర్తి ఫోకస్ తన కెరీర్ పైనే ఉందని.. అందుకే ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదు అంటూ స్పష్టం చేసింది ఈ చిన్నది. ప్రజెంట్ రెండు పెద్ద ప్రాజెక్టుల కోసం చర్చలు జరుపుతోందట. ఈ ప్రాజెక్టులు స్టార్ట్ అయితే.., అమ్మడి కెరీర్ మళ్లీ పిక్స్ కి వెళ్తుందనే గుస గుసలు మొదలయ్యాయి. కేవలం వకీల్ సాబ్ సక్సెస్ తోనే అంజలికి ఈ ఆఫర్స్ అందాయట. దీంతో.., పవన్ ఫ్యాన్స్ అంజలి కెరీర్ ని నిలబెట్టింది మా హీరోనే అంటూ సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేసేస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.