బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పడా అని ఆతృతగా ఎదురుచూసిన బిగ్ బాస్-5 రానే వచ్చేసింది. తెలుగు ప్రేక్షకులకు భారీ వినోదాన్ని పంచే ఈ రియాలిటీ షో ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. ఒక్కొక్కరిని ఏంట్రీతో పరిచయం చేస్తూ హోస్ లోకి పంపాడు హోస్ట్ కింగ్ నాగార్జున. ఎప్పటిలానే ఆకట్టుకునే వాగ్దాటితో నాగ్ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నాడు.
ఇక మాస్ సాంగ్స్ , డాన్స్ లతో అట్టహాసంగా ప్రారంభించాడు టాలీవుడ్ మన్మధుడు నాగ్. గతం మాదరిగానే ఈ షో ప్రేక్షకులు కోరుకునే వినోదాన్ని పంచుతుందో లేదో చూడాలి మరి. ఇక విషయం ఏంటంటే..? మొట్టమొదటి కంటెస్టెంట్ గా హౌస్ లోకి ఏంట్రీ ఇచ్చింది సిరి హన్మంత్. వచ్చి రాగనే హౌస్ లోకి వెళ్లి అంతా కలియ తిరిగి తెగ ఆనందపడింది. దీంతో అలా తిరిగి మురిసేలోపే రెండో కంటెస్టెంట్ వీజే సన్నీ ఎంట్రీ ఇచ్చాడు.
అక్కడి అందాలను చూస్త కాసేపు ముచ్చటపడిపోయాడు. ఇక ఆ తర్వాత హౌస్లో ఉన్న సిరిని చూసిన సన్నీ..ఇద్దరూ కలిసి బిగ్‌బాస్ ఇంటిని చూసేశారు. జిమ్ ఏరియాను చూస్తూ సన్నీ సిక్స్ ప్యాక్ మీద కామెంట్ చేసింది సిరి. నాది సిక్స్ ప్యాక్ కాదు.. ఫ్యామిలీ ప్యాక్ అంటూ సన్నీ నవ్వుతూ ఫన్నీగా కౌంటర్ వేశాడు. ఇక రేపటి నుంచి ఇద్దరం కలిసే జిమ్ లో వర్కవుట్స్ చేద్దాం ఉంటూ చెప్పాడు సన్నీ. దీంతో సన్నీ సిరితో ప్రేమలోకి దింపేందుకు తెగ ఆరాటపడుతున్నాడని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి నిజంగానే సన్నీ సిరితో ప్రేమాయణం నడిపిస్తాడా అన్నది తెలియాల్సి ఉంది. ఇక సన్నీ, సిరీతో జోడిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.