పుష్ప సినిమా హిట్ తర్వాత రష్మక మందన్నా నిజంగానే నేషనల్ క్రష్‌గా మారింది. దక్షిణాది, బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ.. చాలా బిజీగా ఉంది. నటిగా ఎంత బిజీగా ఉన్నప్పటికి సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టీవ్ గా ఉంటారు రష్మిక. ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్‌లో 30 మిలియన్ల ఫాలోవర్లను సంపాదించుకున్న రష్మిక తాజాగా.. యూట్యూబ్‌లో తన సొంత ఛానెల్‌ని ప్రారంభించినట్లు గురువారం ప్రకటించారు. ఈ సందర్భంగా లైవ్ సెషన్ నిర్వహించిన రష్మిక.. ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. తన ఇష్టాఇష్టాలు, ఇష్టమైన ఆహారం, ప్రాంతం వంటి వాటి గురించి అభిమానులకు తెలిపారు. ముఖ్యంగా తనకు ప్రయాణాలు చేయడం అంటే చాలా ఇష్టం అని.. డ్యాన్స్ అన్నా ఎంతో ఇష్టమని చెప్పడమే కాక.. అందుకు గల కారణాలు వివరించారు.
ఇది కూడా చదవండి: ముంబై రోడ్లపై కెమెరా కంటికి చిక్కిన విజయ్- రష్మిక!
ఈ క్రమంలో ఓ నెటిజన్.. రష్మిక ఎక్స్ లవ్, నిశ్చితార్థం రద్దు చేసుకోవడం గురించి ప్రశ్నించాడు. ప్రతి ఒక్కరికి మీ ఎక్స్ లవ్ గురించి, ఎంగేజ్‌మెంట్ బ్రేకపప్ గురించి తెలుసుకోవాలని ఉంది. అసలు మీరు తనతో (రక్షిత్ శెట్టి) ఎందుకు విడిపోయారో తెలుసుకోవాలని ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అటూ ప్రశ్నించాడు. అన్ని ప్రశ్నలకు వెంటవెంటనే సమాధానం చెప్పిన రష్మిక.. దీనికి మాత్రం ఎలాంటి ఆన్సర్ ఇవ్వకుండా దాటేసింది. కాగా రష్మిక కన్నడ నటుడు, తొలి చిత్రం కిరిక్ పార్టీ మూవీ కోస్టార్ రక్షిత్ శెట్టితో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే.
ఇది కూడా చదవండి: RRR విషయంలో రాజమౌళి నమ్మకం! రిలీజ్‌కి ముందే ప్రీమియర్స్!
ఈ క్రమంలో 2018లో అతడితో నిశ్చితార్థం కూడా చేసుకున్న రష్మిక తెలుగులో ఆమె నటించిన గీతా గోవిందం మూవీ అనంతరం రక్షిత్‌తో ఎంగేజ్‌మెంట్‌ను బ్రేక్ చేసుకుంది. అప్పట్లో కన్నడ పరిశ్రమలో ఈ వార్త హాట్‌టాపిక్‌గా నిలిచింది. ఇదిలా ఉంటే యంగ్ హీరో విజయ్ దేవరకొండ-రష్మికలు డేటింగ్ చేస్తున్నారంటూ కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.