చిత్రపరిశ్రమలో కొన్నాళ్లుగా ప్రముఖ సెలబ్రిటీల మరణవార్తలు ప్రేక్షకులను కలవరపెడుతున్నాయి. ఒకరిని కోల్పోయామని బాధ నుండి తేరుకునేలోపే మరొకరిని కోల్పోవడం అనేది విచారకరం. ఇలా సెలబ్రిటీల మరణాలు కేవలం ఇండియాలోనే కాదు, హాలీవుడ్ లో కూడా విషాదాన్ని నింపుతున్నాయి. అందుకు కారణం.. ఆయా సెలబ్రిటీలు వరల్డ్ వైడ్ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగి ఉండటమే. ఈ క్రమంలో మరో ప్రముఖ నటి జోన్ సిడ్నీ కన్నుమూశారు. ‘ఎ కంట్రీ ప్రాక్టీస్’, ‘నెయిబర్స్’ లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న జోన్ సిడ్నీ.. తన 86 ఏళ్ళ వయసులో క్యాన్సర్ తో పోరాడుతూ మరణించారు.
ఈ విషయాన్నీ తెలుపుతూ.. జోన్ సిడ్నీ స్నేహితురాలు సాలీ-అన్నే ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. అదే పోస్టులో జోన్ సిడ్నీకి నివాళి కూడా అర్పించారు. తాజా సమాచారం ప్రకారం.. జోన్ సిడ్నీ డిసెంబర్ 29న సిడ్నీలోని తన ఇంట్లోనే తుదిశ్వాస విడిచింది. దశాబ్దాల సుదీర్ఘ కెరీర్ లో రేడియో, టెలివిజన్, మినీ-సిరీస్, టెలిమూవీలతో పాటు సినిమాలలో కూడా రాణించారు. లండన్ లో జన్మించిన జోన్.. 1957లో రంగస్థల నటిగా ‘వెన్ వి ఆర్ మ్యారీడ్’ అనే ఇంగ్లీష్ నాటకం ద్వారా కెరీర్ ప్రారంభించింది. అప్పుడు జోన్ వయసు 18 ఏళ్ళు. ఆ తర్వాత 1965లో పెర్త్ కి షిఫ్ట్ అయి.. ది స్కాల్ప్ మర్చంట్, హెక్టర్స్ బనిప్, ఫ్లైట్ ఇన్ టు హెల్ లాంటి టీవీ సిరీస్ లలో నటించింది.
జోన్ ముఖ్యంగా 1983-1990 వరకు ప్రసారమైన టీవీ సిరీస్ ‘ఎ కంట్రీ ప్రాక్టీస్’ ద్వారా మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఈ సిరీస్ లో దాదాపు 453 ఎపిసోడ్ లలో జోన్ నటించడం విశేషం. ఇక 1989లో ‘ఎ కంట్రీ ప్రాక్టీస్’ సిరీస్ కి గాను బెస్ట్ పాపులర్ నటిగా సిల్వర్ లాగీ అవార్డును గెలుచుకుంది. అంతేగాక జోన్.. ఈ స్ట్రీట్, ఆల్ సెయింట్స్ సినిమాలతో పాటు నెయిబర్స్ సిరీస్ తో నటిగా జనాలకు మరింత దగ్గరైంది. ఇక జోన్ కి ఓ కూతురు, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇదిలా ఉండగా.. 2015లో రొమ్ము క్యాన్సర్ బారినపడిన జోన్ కి.. అల్జీమర్స్ వ్యాధి సోకడంతో మరింత అనారోగ్యానికి గురయ్యారు. అప్పటినుండి ఇటు వృద్ధాప్యంతో.. అటు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ చివరికి కన్నుమూశారు. ప్రస్తుతం జోన్ సిడ్నీ ఇకలేరనే వార్త హాలీవుడ్ లో విషాదం నింపింది. హాలీవుడ్ ప్రముఖులతో పాటు ఫ్యాన్స్.. జోన్ కి సోషల్ మీడియాలో సంతాపం తెలియజేస్తున్నారు. మరి మీరు కూడా నటి జోన్ మృతి పట్ల సంతాపాన్ని కామెంట్స్ లో తెలపండి.
RIP Joan Sydney. Her role as Valda Sheergold will always be one of the most ICONIC recurring guest characters in #Neighbours’ history! pic.twitter.com/wuJ7JQNxOP
— NeighBens (@NeighBens) January 5, 2023
We all knew her as Matron Maggie Sloan, the formidable head nurse in the much loved @Channel7 TV series ‘A Country Practice’. The actress behind the character was Joan Sydney and today it was revealed, she has died at the age 83. https://t.co/Rql2EcSpjF #JoanSydney #7NEWS pic.twitter.com/5bq4iyXuzG
— 7NEWS Australia (@7NewsAustralia) January 6, 2023