దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన అవార్డు వేడుకలో జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా సందడి చేశాడు. ఈ కార్యక్రమంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బాలీవుడ్ మాస్ హీరో రణ్ వీర్ సింగ్ తో తెగ హంగామా చేశాడు. ఈ ఏడాది ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు క్రీడా రంగంలో నీరజ్ చోప్రా అందుకున్నాడు. నీరజ్ చోప్రా ఆ మద్య స్విట్జర్లాండ్ లో డైమండ్ లీగ్ ట్రోఫిని దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇక పుష్ప: ది రైస్ చిత్రంలో ఉత్తమ నటనకు గాను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్నారు. ఈ అవార్డు అందుకున్న తొలి సౌత్ ఇండియా హీరో అల్లు అర్జున్.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ హాజరయ్యారు. నీరజ్ చోప్రా, అల్లు అర్జున్ తో కలిసి కొద్ది సేపు అభిమానులతో సందడి చేశారు. ఈ సందర్భంగా పుష్ప చిత్రంలో ఫేమస్ డైలాగ్ తగ్గేదే లే అంటూ నీరజ్ చోప్రా యాక్టింగ్ చేసి చూపించాడు. క్రీడా, సినీ రంగానికి చెందిన ఇద్దరు స్టార్లు ఒకేచోట కనిపించడంతో ఫోటోగ్రాఫర్లు, అభిమనులు ఎగబడ్డారు. నీరజ్ చోప్రా, బన్నీ ఇద్దరు కలిసి తగ్గేదే లే అంటూ ఫోజిచ్చారు.
ఇక స్టేజ్ పై బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ చేసిన సందడి అంతా ఇంతా కాదు. నీరజ్ చోప్రా తో కలిసి రణ్ వీర్ స్టెప్పులు వేస్తూ తెగ హంగామా చేశాడు. మ్యూజిక్ కి అనుగుణంగా ఇద్దరు కలిసి తమ డ్యాన్స్ తో అదరగొట్టారు. ప్రస్తుతం వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నాయి.
#NeerajChopra and #AlluArjun together doing a javelin throw and #Pushpa gesture! #IndinofTheYear @cnnbrk pic.twitter.com/JKZdLBrfvK
— Griha Atul (@GrihaAtul) October 12, 2022
#NeerajChopra and #AlluArjun together doing a javelin throw and #Pushpa gesture! #IndinofTheYear @cnnbrk pic.twitter.com/JKZdLBrfvK
— Griha Atul (@GrihaAtul) October 12, 2022