సినీ ఇండస్ట్రీలో ఎంత పెద్ద బిగ్ స్టార్స్ అయినా పౌరాణిక పాత్రలలో లేదా మైథలాజికల్ క్యారెక్టర్స్ లో నటించాలని భావిస్తుంటారు. ఒకప్పుడంటే రెగ్యులర్ సినిమాలతో పాటు పౌరాణికం, మైథలాజికల్ జానర్స్ లో సినిమాలు పోటీగా తెరకెక్కుతుండేవి. తరాలు మారుతున్నకొద్దీ మూవీ మేకింగ్ లో మార్పులు వచ్చేశాయి. సినిమాలు చూసే ఆడియెన్స్ టేస్ట్ లు మారిపోయాయి. ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతున్న టెక్నాలజీతో పాటు సినిమాలు వస్తున్నాయి.. వాటిని బట్టి.. ప్రేక్షకులు కూడా అంచనాలు పెట్టుకుంటున్నారు. అయితే.. తెరపై ఎన్ని కథలు వచ్చినా.. రామాయణ, మహాభారత గాథలను ఏవి బీట్ చేయలేవు.
పైగా సినిమాలలో కనిపించే ఏ చిన్న కథైనా.. కథాంశమైన ఇలాంటి ఇతిహాసాల నుండి పుట్టేవే. ఈ మధ్యకాలంలో ఇతిహాసాలపై సినిమాలు రేర్ గా వస్తున్నాయి. ఇప్పుడు ప్రభాస్ చేస్తున్న ఆదిపురుష్ రామాయణం నేపథ్యంలో వస్తుండగా.. ఓవైపు మరో స్టార్ డైరెక్టర్ రామాయణాన్ని బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ గా ప్లాన్ చేస్తున్నాడు. దర్శకుడు నితీష్ తివారి.. రామాయణ మూవీని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించి.. షూటింగ్ కోసం కావాల్సిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ తో పాటు స్క్రిప్ట్ వర్క్ ని పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నాడట. ఈ క్రమంలో ఇందులో రావణుడి క్యారెక్టర్ కోసం కన్నడ స్టార్ యష్ ని సంప్రదించినట్లు తెలుస్తోంది.
తాజా సమాచారం ప్రకారం.. ఇండియన్ ఎపిక్ గా భావించే రామాయణం కథను లైవ్ యాక్షన్ మూవీగా ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇందులో రాముడిగా బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ నటించనున్నాడని.. రావణుడి పాత్ర కోసం యష్ ని అడిగారని సినీ వర్గాలలో టాక్ నడుస్తోంది. ఇప్పటికే కేజీఎఫ్, కేజీఎఫ్ 2 సినిమాలతో బ్లాక్ బస్టర్స్ అందుకున్న యష్.. ఈ ప్రాజెక్ట్ ఓకే చేస్తే గనుక యష్ కి ఇదే బాలీవుడ్ డెబ్యూ అవుతుంది. అయితే.. ఈ క్యారెక్టర్ కోసం యష్ కావాలని మేకర్స్ ఇంటరెస్ట్ గా ఉన్నప్పటికీ, ఇంకా యష్ నుండి క్లారిటీ రాలేదని అంటున్నారు. ప్రెజెంట్ కేజీఎఫ్ ఇచ్చిన క్రేజ్ తో బిగ్ మూవీ చేయాలనే ఆలోచనలో ఉన్నాడు యష్. సో.. ఈ మూవీని ఓకే చేస్తాడా లేదా వేచి చూడాలి. మరి రామాయణంలో రావణుడిగా యష్ చేస్తే ఎలా ఉంటుందో మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.