ఐశ్వర్యారాయ్ గురించి సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. వయస్సు పెరిగిన కూడా తరగని అందం ఈ పిల్లికళ్ల సుందరి సొంతం. తన అందాన్నికి ప్రపంచ సుందరికి కిరీటమే వరించింది. తన అందం, అభినయంతో ప్రేక్షకుల హృదయాల్లో యువరాణిగా నిలిచిపోయింది. ఎంతో మంది యువకులకి ఆమె కలల రాణి. ప్రత్యేకించి ఆమె కళ్లకే కోట్లాది ఫ్యాన్స్ ఉన్నారు. ఇలాంటి ఎన్నో ప్రత్యేకలతో ఇండియాలో అందానికి కేరాఫ్ అడ్రస్ గా ఈ బాలీవుడ్ భామ మారిపోయింది. ఆమె కనిపిస్తే సామాన్య వ్యక్తులతో పాటు స్టార్ హీరోలు, సెలబ్రిటీలు సైతం మంత్రముగ్ధులైపోతారు. అందుకు నిదర్శనంగా అనేక సంఘటనలు జరిగాయి. అలాంటి ఘటనే తాజాగా పుణెలో చోటుచేసుకుంది. అందరి ముందు ఐశ్వర్యారాయ్ కి బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ ముద్దు పెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..
మహారాష్ట్రలోని పూణేలో ప్రో కబడ్డీ లీగ్ మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ కి ఐశ్వర్యారాయ్, ఆమె భర్త అభిషేక్, కూతురు ఆరాధ్య హాజరయ్యారు. ఇదే మ్యాచ్ కి బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ కూడా హాజరయ్యాడు. మ్యాచ్ జరుగుతున్న సేపు ఐశ్వర్యారాయ్ తమ సొంత టీమ్ జైపూర్ పాంథర్స్ ను ఉత్సాహాపరిచింది. అందరు ఎంతో ఆసక్తిగా మ్యాచ్ ను తిలకిస్తున్నారు. రణవీర్ సింగ్ కూడా స్టేడియంలోని స్టాండ్ లో తెగ సందడి చేశాడు. అందరికి చేతులు ఊపుతూ, విజిల్స్ వేస్తూ స్టాండ్ లో సందడి చేశాడు. పూల చొక్క వేసుకుని, టోపీ ధరించి అక్కడ స్టాండ్ మొత్తం తిరుగుతూ ఎంజాయ్ చేశాడు. మ్యాచ్ జరుగుతుండగా రణవీర్ సింగ్.. అతడికి సమీపంలో ఉన్న ఐశ్వర్యారాయ్ వద్దకు వెళ్లాడు.
Aishwarya pinching Ranveer’s cheek and Ranveer kissing on Aishwarya’s hand. 🥺🥺💕💕. They made my day. #AishwaryaRaiBachchan#RanveerSingh pic.twitter.com/U27YtDrLs0
— Mohabbatein (@sidharth0800) December 18, 2022
ఆమె ముందు మోకాళ్లపై కూర్చొచాలా సేపు మాట్లాడాడు. ఐశ్వర్యా సైతం రణవీర్ సింగ్ మాట్లాడకు చిరునవ్వులు చిందిస్తూ సమాధానాలు ఇచ్చింది. ఈక్రమంలోనే ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని రణవీర్ ముద్దు పెట్టాడు. దీంతో ఐశ్వర్య చిలిపిగా అతడి బుగ్గులు పట్టి లాగింది. సరిగ్గా అదే సమయంలో ఐశ్వర్య కూతురు ఆరాధ్య వింత ఎక్స్ ప్రెషన్ ఇవ్వడం కెమెరాలకు చిక్కింది. దీంతో నెటిజన్లు ఈ వీడియోపై ఫన్నీ మీమ్స్ క్రియేట్ చేస్తూ నెట్టింటో హల్ చల్ చేసున్నారు. రణవీర్ లక్ బాయ్ అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాను హీట్ ఎక్కిస్తోంది.
ఇక ఐశ్వర్యారాయ్ సినిమాల విషయానికి వస్తే.. ఇటీవలే మణిరత్నం తెరకెక్కించిన ‘పొన్నియన్ సెల్వన్’ మూవీతో ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమాలో ఐశ్వర్యతో పాటు కార్తీ, జయం రవి, విక్రమ్, ప్రకాష్ రాజ్, త్రిష వంటి స్టార్ యాక్టర్లు నటించారు. ఇక రణవీర్ సింగ్ విషయానికి వస్తే.. సర్కస్, ‘రాకీ ఔర్ రాణికీ ప్రేమ్ కహాని’ చిత్రాల్లో నటిస్తున్నాడు. సర్కస్ మూవీ డిసెంబర్ 23న థియేటర్లలోకి రానుంది. ఐశ్వర్యారాయ్, రణ వీర్ సింగ్ మధ్య జరిగిన ఈ ఫన్నీ ఇన్సిడెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.