Nawazuddin Siddiqui: సౌత్ సినిమా వర్సెస్ నార్త్ సినిమా రగడ కొనసాగుతోంది. నార్త్‌లో సౌత్ సినిమాలు సాధిస్తున్న విజయంపై బాలీవుడ్ ప్రముఖులు కుళ్లుకుంటున్నారు. కొంతమంది బాహాటంగా దీనిపై స్పందిస్తుంటే.. మరికొంతమంది లోలోపల మదన పడిపోతున్నారు. అవకాశం వచ్చినపుడు తమ అక్కసును వెళ్లగక్కుతున్నారు. ప్రస్తుతం ఈ జాబితాలోకి బాలీవుడ్ విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ చేరారు. బాలీవుడ్ వర్సెస్ సౌత్ సినిమాలపై స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ ఇప్పటి వరకు నేను సౌత్ సినిమాలు చూడలేదు. సౌత్ సినిమాలే కాదు, కమర్షియల్ సినిమాలంటేనే నాకు పెద్దగా ఆసక్తి లేదు. అందుకే అలాంటి సినిమాలు చూడను. ప్రస్తుతం నాకు సినిమాలు చూసేంత ఖాళీ కూడా లేదు. కాబట్టి, నేను సౌత్ సినిమాల సక్సెస్‌పై మాట్లాడలేను. అయినా ఒక సినిమా హిట్ అయితే అంతా కలిసి దాన్ని పైకి లేపడం, కలెక్షన్స్ రాకుంటే వెంటనే విమర్శలు చేయడం ఇప్పుడు మామూలైపోయింది.
బాలీవుడ్‌కు ఒక్క పెద్ద హిట్ పడితే అంతా మారిపోతుంది. జనం లాక్‌డౌన్‌లో ఖాళీగా ఉండి అంతర్జాతీయ సినిమాలు చూడటం వల్ల వారి అభిరుచిలో మార్పు వచ్చింది. అది నేను ముందుగానే ఊహించాను. కానీ, ఆ మార్పు ఒకరకంగా వినాశనాకికే. ప్రస్తుతం ప్రేక్షకులు మసాలా కంటెంట్‌తో వస్తున్న సినిమాలనే ఎక్కువగా ఆదరిస్తున్నారు. ఇదొక ట్రెండ్‌లాంటిది. నేను కూడా హీరో పంటి 2 లాంటి కమర్షియల్ సినిమా చేశా. ఆ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఆ సినిమా భారీ వసూళ్లు సాధిస్తుంది’’ అని ఆశాభావం వ్యక్తం చేశారు. మరి, నవాజుద్దీన్ సిద్ధిఖీ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Gopichand: ప్రమాదంలో గాయపడ్డ హీరో గోపీచంద్