ఇటీవల గుండెపోటు కి గురైన తారకరత్న కు బెంగుళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో చికిత్స అందిస్తున్నారు. 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన తారకరత్న శనివారం తుదిశ్వాస విడిచారు.
గత ఏడాది నుంచి టాలీవుడ్ కి అస్సలు కలిసి రావడం లేదు. ప్రముఖ నటులు వరుసగా కన్నుమూస్తున్నారు.. గత ఏడాది కృష్ణం రాజు, కృష్ణ, కైకాల సత్యనారాయణ.. ఈ ఏడాది ప్రముఖ నటి జమున, దిగ్గజ దర్శకులు కే. విశ్వనాథ్ కన్నుమూశారు. ఈ విషాదం నుంచి కోలుకోకముందే నందమూరి ఫ్యామిలీలో విషాదం చోటు చేసుకుంది. నందమూరి తారకరత్న తుదిశ్వాస విడిచారు. గత నెల 27 న కుప్పంలో తీవ్ర గుండెపోటు రావడంతో బెంగుళూరు నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో చికిత్స అందిస్తున్నారు. 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన తారకరత్న శనివారం తుదిశ్వాస విడిచారు. దీంతో టాలీవుడ్ లో ఒక్కసారిగా విషాదఛాయలు నెలకొన్నాయి.
తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంది వారసులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. అలాంటి వారిలో అతి కొద్ది మంది హీరోలు మాత్రమే స్టార్ హీరోలు అయ్యారు. నందమూరి ఫ్యామిలీ నుంచి సీనియర్ ఎన్టీఆర్ తర్వాత ఆయన తనయులు హరికృష్ణ, బాలకృష్ణ హీరోలుగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ బాలకృష్ణ మాస్ ఇమేజ్ తో స్టార్ హీరో అయ్యారు. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, తారకరత్న లు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. ఎన్టీఆర్ స్టార్ హీరో రేంజ్ కి ఎదిగాడు. ఇక కళ్యాణ్ రామ్ హీరోగా, నిర్మాతగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నారు. కానీ, తారకరత్నకు పెద్దగా సక్సెస్ లు కలిసి రాలేదు.
నందమూరి మోహన కృష్ణ తనయుడే ఇండస్ట్రీలో వారసుడిగా ఎంట్రీ ఇస్తూనే తారకరత్న ఏ హీరో చేయలేని వండర్స్ క్రియేట్ చేశారు. అప్పటి వరకు ఏ హీరో చేయలేని సాహసం చేశారు. సాధారణంగా ఇండస్ట్రీలోకి ఎవరైనా ఒక్క సినిమాతో ఎంట్రీ ఇస్తారు.. ఆ సినిమా సక్సెస్ మీదనే ఫ్యూచర్ ఆధారపడి ఉంటుంది. కానీ ఒకేసారి 9 సినిమాలతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి సంచలనం సృష్టించాడు నందమూరి తారకరత్న. అప్పట్లో ఇండస్ట్రీలో ఈ విషయం పెద్ద సంచలనం.
ఒక్కసారే 9 సినిమాలు.. ఒకేరోజు మొదలు కావడం నిజంగా వండర్ అనే చెప్పొచ్చు. అప్పట్లోనే కాదు.. ఇప్పటికీ ఇది ఒక వరల్డ్ రికార్డే అంటారు. 20 ఏళ్ల వయసులోనే 2002 లో ‘ఒకటో నెంబర్ కుర్రాడు’ సినిమాతో వచ్చాడు తారక్. ఆయన కెరీర్ లో 21 సినిమాల్లో నటించారు. ‘సారథి’ తర్వాత తారకరత్న ఏ మూవీలో నటించలేదు. ‘9 అవర్స్’ వెబ్ సిరీస్ నటించారు. తారకరత్న మరణ వార్త విన్న అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.