సినిమా ఇండస్ట్రీలోకి వారసులుగా ఎంట్రీ ఇచ్చారంటే.. వారికి మిగితావాళ్లకంటే కాస్త ఎక్కువే ప్రధాన్యత ఉంటుంది. బడా నిర్మాతలు, దర్శకులు సినిమాలు చేసేందుకు మందుకు వస్తుంటారు. కాబట్టి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చేవారికంటే బ్యాగ్రౌండ్ ఉన్నవాళ్లు స్టార్ లు అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది. కానీ అవకాశం వచ్చిన తరవాత కూడా దాన్ని వినియోగించుకోకపోతే కెరీర్ లో ఫ్లాప్ లు చూడక తప్పదు. ఇలా పవర్‌ఫుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఉన్న నందమూరి కుటుంబం నుంచి వచ్చిన హీరో తారకరత్న. ఎంట్రీ ఇవ్వడమే పవర్ ప్యాక్ వంటి కాంబినేషన్‌లో హీరోగా లాంచ్ అయ్యారు. ఒకటో నంబర్ కుర్రాడు సినిమాతో తారకరత్న పరిచయం అయ్యాడు. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. ఇక ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ.. బిజీగా ఉన్నారు.
ఆ తర్వాత సడెన్‌గా సినిమాలకు దూరం అయ్యారు. తర్వాత విలన్ పాత్రలు కూడా పోషించారు. ప్రస్తుతం 9 అవర్స్ వెబ్ సిరీస్‌తో మరో సారి ప్రేక్షకులు మందుకు వచ్చాడు. ఈ క్రమంలో తారకరత్నతో సుమన్‌టీవీ ఎక్స్‌క్లూజీవ్ ఇంటర్వ్యూ నిర్వహించింది. దీనిలో ఆయన పలు ఆసక్తికర అంశాల గురించి ముచ్చటించారు. జూనియర్ ఎన్టీఆర్‌తో తన అనుబంధం, కుటుంబంతో రిలేషన్, పార్టీలో తన పాత్ర వంటి పలు అంశాల గురించి తెలిపారు. పూర్తి వివరాల కోసం వీడియో చూడండి. తారకరత్న వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.