నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న మూవీ “బింబిసార”. ఈ సినిమాను డెబ్యూ డైరెక్టర్ మల్లిడి వశిష్ట్ తెరకెక్కిస్తున్నాడు. కల్యాణ్ రామ్ సరసన కేథరిన్, సంయుక్త మేనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఆగస్టు 5న ఈ సినిమా విడుదల కాబోతుంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో జరిగింది. ఈ ఈవెంట్‌కి జూనియర్ యన్టీఆర్ చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యాడు. అయితే కార్యక్రమంలో విషాదం చోటుచేసుకుంది. ఓ అభిమాని అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుడిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తాడేపల్లిగూడెంగా గుర్తించారు. మృతదేహాన్ని ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ లోని తాడేపల్లి గూడెంకు చెందిన పుట్టా సాయి రామ్ అనే వ్యక్తి ఓ ప్రైవేట్ జాబ్ చేస్తూ కూకట్ పల్లిలో ఉంటున్నాడు. కల్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సోషియో ఫాంటసీ చిత్రం బింబిసార ప్రీ రిలీజ్ ఈ వెంట్ శుక్రవారం జరిగింది. యంగ్ టైగర్ యన్టీఆర్ ఈ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. నందమూరి అభిమానులు ఈ కార్యక్రమానికి భారీగా వచ్చారు. ఈ నేపథ్యంలో ఈవెంట్‌కి వచ్చిన సాయిరామ్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. దాంతో మృతదేహాన్ని ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు. ఈ మృతిపై పూర్తి వివరాల కోసం పోలీసులు విచారణ చేపడుతున్నారు.
అయితే ఈ ఘటనపై ‘బింబిసార’ మూవీ టీమ్ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. సాయిరామ్ మృతి.. తమను తీవ్రం కలచి వేసిందన్నారు చిత్రబృందం. అతని మృతికి సంతాపం తెలియజేశారు. మాకు సాధ్యమైనంత వరకు అతని కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.