Kalyan Ram: ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి ఎంత పేరుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వెండి తెర ఆరాధ్య దైవం ఎన్టీఆర్ నట వారసులుగా వారి కుమారులు హరికృష్ణ, బాలక్రిష్ణలతో పాటు కొంతమంది మనవళ్లు కూడా సినీ రంగంలోకి వచ్చారు. అలాంటి వారిలో నందమూరి కల్యాణ్ రామ్ ఒకరు. ఆయన హీరోగా నటించిన సోషియో ఫాంటసీ సినిమా ‘బింబిసార’ విడుదలకు సిద్దమైంది. ఆగస్టు 5 థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో కల్యాణ్ రామ్ సినిమా ప్రమోషన్లలో బిజీబిజీగా గడుపుతున్నారు. తాజాగా, ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలోతన తమ్ముడు జూ.ఎన్టీఆర్ గురించి ఆయన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కల్యాణ్ రామ్ మాట్లాడుతూ.. ‘‘ తారక్ ఫ్యామిలీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తి. వాళ్ల అమ్మ సైడు ఉన్న చెల్లెళ్లను ఎంతో బాగా చూసుకుంటాడు. అది చాలా మందికి తెలియదు. వాళ్లకు అన్ని వసతులు కల్పిస్తున్నాడు. అది నాకు చాలా బాగా నచ్చింది. నేను కూడా ఫ్యామిలీ అంటే ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తిని. నాకు ఇప్పటికి కూడా ఉమ్మడి కుటుంబం అంటే ఇష్టం. మా మధ్య పర్సనల్స్ అంటూ ఏవీ ఉండవు. ఏదైనా బాధ వేస్తే.. బాధేసిందని చెప్పుకుంటాము’’ అని తమ్ముడితో తనకున్న అనుబంధాన్ని చెప్పుకొచ్చారు. ఇవి కూడా చదవండి : Ram Charan: జేమ్స్‌బాండ్ గా రామ్‌చరణ్..? హాలీవుడ్ రైటర్ ట్వీట్!