Unstoppable 2: టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ.. గతేడాది అఖండ సినిమా బ్లాక్ బస్టర్ తర్వాత అదే ఊపులో వరుసగా ఫ్యూచర్ ప్రాజెక్టులను కూడా లైనప్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం క్రాక్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో ఓ సినిమా, డైరెక్టర్ అనిల్ రావిపూడితో ఓ సినిమా ఓకే చేశాడు బాలయ్య. అయితే.. సినిమాలు మాత్రమే కాకుండా ఓటిటి ప్రేక్షకులను సైతం తన హోస్టింగ్ తో ఆకట్టుకున్నాడు.
బాలయ్య హోస్ట్ గా తెలుగు ఓటిటి ఆహాలో ‘అన్ స్టాపబుల్‘ అనే సెలబ్రిటీ టాక్ షో ప్రసారం అయ్యింది. మొదటి ఎపిసోడ్ నుండే ఎంతో ఉత్సాహంగా షోని తనదైన శైలిలో ముందుకు తీసుకెళ్లిన బాలయ్య.. అన్ స్టాపబుల్ షోని ఇంతవరకూ ఏ తెలుగు టీవీ షో అందుకోలేని రేంజికి చేర్చాడు. అలాగే అన్ స్టాపబుల్ షో ద్వారా దేశవ్యాప్తంగా సూపర్ క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇప్పుడు సెకండ్ సీజన్ కోసం రెడీ అవుతున్నాడు.
ఇక ఫస్ట్ సీజన్ లో మోహన్ బాబు, నాని, బ్రహ్మానందం, అనిల్ రావిపూడి, అఖండ టీమ్, రాజమౌళి, కీరవాణి, రవితేజ, గోపీచంద్ మలినేని, మహేష్ బాబు తదితరులు బాలయ్యతో సందడి చేశారు. అయితే.. ప్రస్తుతం అన్ స్టాపబుల్ సెకండ్ సీజన్ డేట్ ఫిక్స్ అయినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇటీవలే ఆహా టీమ్ సైతం ఓ ప్రోమోను రిలీజ్ చేసింది. కానీ.. ఆహా డేట్ మాత్రం ప్రకటించలేదు.
ఇదిలా ఉండగా.. బాలయ్యను అన్ స్టాపబుల్ సీజన్ 2లో చూడాలని ఎంతోమంది అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇక తాజా సమాచారం ప్రకారం ఆగస్టు మొదటివారం(2వ తేదీ) నుండి ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తుంది. ఈ వార్త తెలిసి బాలయ్య ఫ్యాన్స్ అంతా సోషల్ మీడియాలో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కానీ.. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరి అన్ స్టాపబుల్ సీజన్ 2 పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.