Higher Purpose : మంచు వర్సెస్ మెగా ఫ్యామిలీ గొడవలు ఇప్పట్లో చల్లారేలా లేవు. రెండు వైపుల్లోని ఎవరో ఒకరు చల్లారుతున్న మంటలో ఆజ్యం పోస్తూనే ఉన్నారు. మొన్నటి వరకు నాగబాబు.. మోహన్ బాబు, విష్ణులపై సెటైరికల్, సీరియస్ కామెంట్లు చేశారు. తర్వాత కామ్‌గా అయిపోయారు. ఇక ఏ గొడవ లేదులే అనుకునే సమయానికి మంచు మనోజ్ చేసిన కామెంట్లతో నిప్పురాజుకుంటోంది. శ్రీ విద్యానికేతన్ 30వ వార్షికోత్సవం వేడుకల సందర్భంగా మనోజ్ మాట్లాడుతూ..
నాగ బాబుపై ఇన్‌డైరెక్ట్‌గా సీరియస్ అయ్యారు. అన్న విష్ణును మా ఎన్నికల సందర్భంగా తిట్టడంపై మండిపడ్డారు. మొత్తానికి నాగబాబుకు హైయర్ పర్పస్ లేని కారణంగానే తమతో గొడవలు పెట్టుకుంటున్నాడని తేల్చారు. ఈ హైయర్ పర్పస్ కామెంట్లు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా, దీనిపై నాగబాబు స్పందించారు. తన అధికారిక ఫేస్‌బుక్ ఖాతా ద్వారా ‘ఆస్క్ మీ’ పేరిట అభిమానులతో ముచ్చటించే కార్యక్రమంలో పాల్గొన్నారు. అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.ఓ అభిమాని.. ‘‘ఇన్ని రోజుల తర్వాత ఆస్క్ మీ పెట్టడానికి కారణం ఏంటి సార్?’’ అని ప్రశ్నించారు. నాగబాబు దానికి సమాధానంగా ‘‘ హైయర్ పర్పస్ కోసం’’ అంటూ స్పందించారు. అభిమానులు దీన్ని మంచు మనోజ్‌కు కౌంటర్ అని భావిస్తున్నారు. మరి నాగబాబు మనోజ్ కామెంట్లపై స్పందించటాన్ని ఇంతటితో ఆపేస్తారా? లేక వీలు కల్పించుకుని విరుచుపడతారా.. వేచి చూడాలి మరి.. నాగబాబు హైయర్ పర్పస్ స్పందనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : హైపర్ ఆది, బులెట్ భాస్కర్‌ల చెంప ఛెళ్లుమనిపించిన రోజా
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.