విలక్షణ కథలను ఎంచుకుంటూ ముందుకెళ్తున్న యువ హీరో నాగ శౌర్య.. అచ్చ తెలుగు అమ్మాయి రీతూ వర్మ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న లెటేస్ట్ చిత్రం ‘వరుడు కావలెను’. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాను పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు.. లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
కథ :
భూమి (రీతూ వర్మ) పెద్ద ఎంఎన్సీ కంపెనీలో పని చేసే అమ్మాయి. స్వతంత్ర భావాలు కలిగి.. పెళ్లి విషయంలో తనకంటూ కొన్ని అభిప్రాయాలు ఉన్న యువతిగా కనిపిస్తుంది. ఆకాశ్ (నాగశౌర్య) దుబాయ్ లో ఆర్కిటెక్ట్ గా పనిచేస్తాడు. ఓ ప్రాజెక్ట్ కోసం ఇండియాకి వచ్చిన ఆకాశ్ పెళ్లి చూపులు సందర్భంలో భూమికను చూసి ఇష్టపడతాడు. కానీ ఆమె మాత్రం అతన్ని రిజక్ట్ చేస్తూ వస్తుంది. ఇక ఇష్టపడ్డ అమ్మాయిని ఎలా దక్కించుకుంటాడు.. ఆమె కోసం ఎన్ని కష్టాలు పడతాడు.. చివరకు పెళ్లిపై అభిప్రాయం మార్చి ఆమెను పెళ్లి చేసుకుంటాడా? లేదా అన్నది తెరపై చూడాల్సిందే.
విశ్లేషణ :
భూమి పాత్రలో రీతూ వర్మ ఈ తరం అమ్మాయిగా మంచి నటన కనబరిచింది. స్వతంత్ర భావాలు కలిగిన అమ్మాయిగా చాలా హూందాగా నటించింది. అంతే కాదు ఈ తరం అమ్మాయిలు.. అబ్బాయిలతో సమానంగా ఉంటారని.. మోసం చేసేవారికి ఎలా బుద్ది చెప్పాలి.. వాళ్లను ఎలా కంట్రోల్ లో ఉంచాలన్న భూమి క్యారెక్టర్ కి జీవం పోసింది. ఇక ఆర్కిటెక్ గా చాలా స్టైలిష్ లుక్ తో నాగ శౌర్య కనిపించాడు. భూమి లాంటి స్వతంత్ర భావాలు..ముక్కు మీద కోపం ఉన్న అమ్మాయిని లైన్లో ఎలా పడేసుకోవాలన్న పాత్రలో చాలా ఫన్నీగా, సీరియస్ గా నటిస్తూ తన పాత్రకు మంచి న్యాయం చేశాడు. నాగ శౌర్య, రీతూ మధ్య కొన్ని కామెడీ సీన్లు సినిమాకు హైలెట్ గా నిలిచాయి. ఫస్టాఫ్ మొత్తం పెళ్లి చూపులు సీన్లతో చాలా ఉల్లాసంగా నడిచింది. విలేజ్ లో వచ్చే సీన్లు చాలా బాగా ఆకట్టుకున్నాయి. కొన్ని ఎమోషనల్ సీన్స్ కంటతడి పెట్టించాయి. సెకండ్ ఆఫ్ మాత్రం సెంటిమెంట్ సీన్లతో కొద్దిపాటి సీరియస్ మోడ్ లోకి తీసుకు వెళ్లాడు దర్శకులు. కాకపోతే కొంత బోర్ సీన్లు ఉన్నట్లు ఆడియాన్స్ అభిప్రాయ పడుతున్నారు.
నటీనటులు :
వరుడు కావలెను అన్న మూవీ మొత్తం కుటుంబ నేపథ్యంలో నడిచింది. ఈ మూవీలో పాత్రదారులు చాలా మంది ఉన్నారు. ఇక నాగ శౌర్య ఓ ఆర్కిటెక్ట్ పాత్రలో చాలా అద్భుతంగా కనిపించాడు. మొండిగా ఉండే అమ్మాయిని ఎలా తన వైపు తిప్పుకోవాలన్న ఆకాశ్ పాత్ర చాలా అద్భుతంగా ఉంది. మొత్తానికి తన క్యారెక్టర్ పరంగా నాగౌశర్య మంచి మార్కులు కొట్టేశాడని అంటున్నారు. ఇక ఈ కాలం అమ్మాయిలు స్వతంత్ర భావాలతో ఉంటూ.. ఉద్యోగం చేస్తూ తమ కాళ్లపై తాము నిలబడి గర్వంగా బతికాలి అన్న అభిప్రాయాలతో ఉండే భూమి పాత్రలో రీతూ వర్మ చాలా చక్కగా నటించింది. నదియా,మురళీ శర్మ, వెన్నెల కిషోర్, ప్రవీణ్,హిమజ తమ పాత్రలకు మంచి న్యాయం చేశారు.
సాంకేతిక వర్గం :
ఓ మంచి ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ గా తీర్చి దిద్దడంలో డైరెక్టర్ లక్ష్మీ సౌజన్య బాగానే కష్టపడ్డట్టు తెలుస్తుంది. సినిమాలో ఎక్కడా వల్గారిటీ లేకుండా ఫుల్ లెన్త్ కామెడీతో పాటు మంచి ఎమోషనల్ సీన్లు పండించారు. ఇక ప్రొడక్షన్ వ్యాల్యూస్ చాలా బాగున్నాయి. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది.. పచ్చిపులుస వంశి, విష్ణు వ్యూజువల్స్ చాలా అద్భుతంగా చూపించారు. నవీన్ నూలీ ఎడిటింగ్ బాగానే వర్క్ ఔట్ చేశారు. బ్యాగ్ గ్రౌండ్ మ్యూజిక్.. సంగీతం బాగానే అందించారు విశాల్ చంద్రశేఖర్.
ప్లస్ : రీతూ వర్మ, నాగశౌర్య, కామెడీ సీన్లు
మైనస్ : సెకండ్ ఆఫ్ బోర్ సీన్లు
రేటింగ్ : 2.5/5
బాటమ్ లైన్ : వరుడు బాగా నచ్చాడు