నందమూరి.. తెలుగునాట ఈ పేరుకి ఒక చరిత్ర ఉంది. మాటల్లో చెప్పలేనంత ఫాలోయింగ్ ఉంది. వారికి మాత్రమే సాధ్యమైన ఒక చరిత్ర ఉంది. గత కొన్ని దశాబ్దాల నుండి తెలుగు చలనచిత్ర రంగంపై వారి సంతకం ఒక చెదరని ముద్ర. ముందుగా అన్న నందమూరి తారక రామారావు, ఆ తరువాత తరంలో నందమూరి బాలకృష్ణ.. మూడో తరంలో జూనియర్ యన్టీఆర్, కళ్యాణ్ రామ్.. నందమూరి హీరోలుగా ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటూ వస్తున్నారు.
అయితే.., బాక్సాఫీస్ వద్ద మల్టీస్టారర్ ఫార్ములా కాసుల వర్షం కురిపిస్తోంది. రీసెంట్ గా సూపర్ సక్సెస్ కొట్టిన RRR అందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే నందమూరి వారి మల్టీస్టారర్ తెరకెక్కబోతుందా? బాలకృష్ణ, యన్టీఆర్, కళ్యాణ్ రామ్ కలసి ఓకే సినిమాలో నటించబోతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.
బాలకృష్ణ – కల్యాణ్‌రామ్ – ఎన్టీఆర్‌లను కలిపి సినిమా చేయడం అంటే మాటలు కాదు. అయితే.. ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసే బాధ్యత దర్శకుడు ప్రవీణ్ సత్తారు తీసుకున్నారని సమాచారం. ఈయన నేతృత్వంలో నందమూరి మల్టీస్టారర్ ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయట. ప్రవీణ్ సత్తారు ఇప్పటికే “NBK” పేరుతో కథను సిద్ధం చేశారని, టైటిల్ కూడా రిజిస్టర్ అయ్యిందన్న టాక్ వినిపిస్తోంది. “NBK” లో N అంటే యన్టీఆర్, B అంటే బాలకృష్ణ, K అంటే కళ్యాణ్ రామ్ అని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.
జరుగుతున్న ఈ పరిణామాలు అన్నీ చూస్తుంటే.. నందమూరి మల్టీస్టారర్ ప్రయత్నాలు గట్టిగానే జరుగుతున్నట్టు అనిపించక మానదు. కానీ.., ఈ మల్టీస్టారర్ కి బాబాయ్-అబ్బాయిలు ఓకే అంటారా? లేదా? అన్నదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. మరి.. నందమూరి హీరోల మల్టీస్టారర్ రావాలని మీరు కోరుకుంటున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.