తక్కువ టైంలో కృతి శెట్టి ఎక్కువ పాపులారిటీ తెచ్చుకున్నారు. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో వరుస సినిమాలు చేస్తున్నారు. అయితే, గత కొన్ని సినిమాల నుంచి ఆమె గ్రాఫ్ బాగా పడిపోయింది. దీనికి కారణం ఆమేనని...
ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తక్కువ టైంలో ఎక్కువ పాపులారిటీ తెచ్చుకున్న అతి కొద్ది మంది హీరోయిన్స్‌లో కృతి శెట్టి ఒకరు. ఉప్పెన సినిమాతో హీరోయిన్‌గా పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈమె వరుస హిట్లను అందుకున్నారు. ఉప్పెన, శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు సినిమాలు హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. తర్వాత ద్విభాషా చిత్రమైన ‘ వారియర్’లో అవకాశాన్ని దక్కించుకున్నారు. అయితే, ఈ సినిమా ఆశించినంత విజయాన్ని సొంతం చేసుకోలేకపోయింది. తర్వాత వచ్చిన ‘మాచర్ల నియోజకవర్గం’, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాలు కూడా వరుస పరాజయాల్ని సొంతం చేసుకున్నాయి.
వారియర్ సినిమా వరకు కోటికి పైగా రెమ్యూనరేషన్ తీసుకున్న కృతి ఇప్పుడు వెనక్కు తగ్గారు. కోటి లోపే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. వరుస హిట్లతో దూసుకుపోతున్న ఆమె కెరీర్ ఇలా అవ్వటానికి కారణం ఏంటన్న దానిపై సినిమా సర్కిల్‌లో ఓ ఆసక్తికరమైన ప్రచారం జరుగుతోంది. కృతి శెట్టి తన తల్లి కారణంగానే సినిమాల విషయంలో వెనక్కు పడుతోందన్న టాక్ వినిపిస్తోంది. కృతి శెట్టి సినిమా కథల ఎంపిక విషయంలో ఆమె తల్లి నీతి శెట్టి కలుగజేసుకుంటున్నారట. ఎవరైనా కృతి శెట్టికి కథ చెప్పటానికి వెళ్లినపుడు.. కృతితో పాటు ఆమె తల్లి కూడా వింటున్నారట.
ఆమెకు కూడా కథ నచ్చితేనే సినిమా చేయటానికి ఒప్పుకుంటున్నారట. లేదంటే వద్దని అంటున్నారట. ఇలా నీతి.. కృతి శెట్టి దగ్గరకు వచ్చిన చాలా సినిమాలను రిజెక్ట్ చేశారట. అలా ఆమె రిజెక్ట్ చేసిన సినిమాల్లో హిట్ సినిమాలు కూడా ఉన్నాయట. దీంతో కృతి శెట్టి హిట్టు సినిమాలను వద్దనుకుని, ప్లాపు సినిమాలను ఎంచుకోవాల్సి వచ్చింది. కోటికిపైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ఆమె వెనక్కు పడిపోవాల్సి వచ్చింది. కాగా, కృతి శెట్టి చేతిలో ఇప్పుడు తెలుగుతో పాటు తమిళం, మలయాళం సినిమాలు చేతిలో ఉన్నాయి. వాటిలో కొన్ని సినిమాలు విడుదలకు సిద్దంగా ఉండగా.. మరికొన్ని షూటింగ్ జరుపుకుంటున్నాయి. మరి, కృతి శెట్టి వెనకబడిపోవటానికి ఆమె తల్లే కారణమని జరుగుతున్న ప్రచారంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.