సినీ ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాలలో 'ఎన్టీఆర్ 30' ఒకటి. యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కనున్న ఈ సినిమాపై.. అనౌన్స్ మెంట్ నుండే అంచనాలు భారీగా సెట్ అయ్యాయి. ఈ సినిమాకి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ నందమూరి ఫ్యాన్స్ కి నిరాశ కలిగిస్తోందని సమాచారం.
సినీ ఇండస్ట్రీలో సూపర్ హిట్ కాంబినేషన్స్ రిపీట్ అవుతుంటే ఫ్యాన్స్ లో ఎక్సయిట్ మెంట్ పెరుగుతూ ఉంటుంది. ప్రాజెక్ట్ అనౌన్స్ మెంట్ అయినప్పటి నుండి ఎప్పుడెప్పుడు అని కొత్త అప్ డేట్స్ కోసం ఎదురు చూస్తుంటారు. ప్రెజెంట్ అలా ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాలలో ‘ఎన్టీఆర్ 30’ ఒకటి. యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కనున్న ఈ సినిమాపై.. అనౌన్స్ మెంట్ నుండే అంచనాలు భారీగా సెట్ అయ్యాయి. వీరి కాంబినేషన్ లో ఇదివరకే ‘జనతా గ్యారేజ్’ వచ్చి సక్సెస్ అయ్యింది. ఎన్టీఆర్ ని రక్తపాతం లేకుండా చాలా కూల్ గా, కొత్తగా చూపించాడు కొరటాల.
అలాంటిది ఈసారి రక్తపాతంతో పాటు ఎన్టీఆర్ లోని మాస్ యాంగిల్ ని కొత్త వేలో ప్రెజెంట్ చేసేందుకు రెడీ అవుతున్నాడట. ఆర్ఆర్ఆర్ తో ఎన్టీఆర్ పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అదే బాటలో ఇప్పుడు కొరటాల సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ లో 2024 ఏప్రిల్ 5న రిలీజ్ కాబోతుందని ఆల్రెడీ అధికారికంగా ప్రకటించారు. సో.. రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ చేశారు కానీ.. ఇంకా సినిమా షూటింగ్ మొదలు కాలేదని నిరాశలో ఉన్నారు నందమూరి ఫ్యాన్స్. అయితే.. ఇప్పుడు ఫిబ్రవరి 24 నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుందని తెలుస్తోంది. ఈ క్రమంలో సినిమాకి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కామన్ ఆడియెన్స్ కి ఆ న్యూస్ వినడానికి క్రేజీగా అనిపించినా.. నందమూరి ఫ్యాన్స్ కి మాత్రం నిరాశ కలిగిస్తోందని సమాచారం. ఇంతకీ ఫ్యాన్స్ ని నిరాశ పరుస్తున్న వార్త ఏంటంటే.. ఎన్టీఆర్30లో కూడా మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలకపాత్రలో నటించనున్నాడట. ఇదివరకు జనతా గ్యారేజ్ లో ఎన్టీఆర్ , మోహన్ లాల్ కాంబినేషన్ సెట్ చేశాడు కొరటాల. ఆ సినిమా ఫలితం సూపర్ హిట్టే అయినప్పటికీ.. ఇప్పుడు మరోసారి ఎన్టీఆర్ సినిమాలో మోహన్ లాల్ ని రిపీట్ చేయొద్దని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఎందుకని మోహన్ లాల్ లాంటి స్టార్ ని ఎన్టీఆర్ సినిమాలో వద్దని అంటున్నారు..? అనంటే ఫ్యాన్స్ కారణాలు కూడా చెబుతున్నారు.
ఇక ఎన్టీఆర్30లో మోహన్ లాల్ ఉంటాడని ప్రస్తుతానికి రూమర్స్ మాత్రమే వినిపిస్తున్నాయి. మేకర్స్ ఇంకా దీనిపై అధికారికంగా ప్రకటన ఇవ్వలేదు. అయినా.. మోహన్ లాల్ ఎన్టీఆర్ సినిమాలో వద్దంటూ వారిస్తున్నారు ఫ్యాన్స్. ఎన్టీఆర్ – మోహన్ లాల్ సెంటిమెంట్ మళ్లీ మళ్లీ వర్కౌట్ అవ్వదని, ఒకవేళ కాంబినేషన్ రిపీట్ చేస్తే మాత్రం.. దర్శకుడు కొరటాల భారీ స్థాయిలో విమర్శలను ఫేస్ చేయాల్సి ఉంటుందని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఎన్టీఆర్ సినిమాలో మోహన్ లాల్ వద్దని కుండబద్దలు కొట్టేస్తున్నారు నందమూరి ఫ్యాన్స్. ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన శ్రీదేవి కూతురు జాన్వీకపూర్ నటించనుందని టాక్ నడుస్తోంది. ఈ సినిమాని యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రాక్ స్టార్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. చూడాలి మరి మోహన్ లాల్ విషయంలో కొరటాల క్లారిటీ ఇస్తాడేమో! సో.. ఎన్టీఆర్30పై మీ అభిప్రాయాలు, అంచనాలు ఎలా ఉన్నాయో కామెంట్స్ లో తెలియజేయండి.
Most Awaited #NTR30 Official Launch on 24th February with formal pooja Ceremony 🎑.
More Updates Rolling Soon🔥@tarak9999 #KoratalaSiva @anirudhofficial @RathnaveluDop @sabucyril @sreekar_prasad @NANDAMURIKALYAN @NTRArtsOfficial @YuvasudhaArts pic.twitter.com/FyTE9Au4Fz
— KoratalaSiva Trends (@KoratalaTrends) February 13, 2023