తనను కావాలని రెచ్చగొడుతున్నారని, తాను అసమర్థుడిని కాదని మోహన్‌బాబు అన్నారు. ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన మా ఎన్నికల్లో ఆయన కుమారుడు మంచు విష్ణు విజయం సాధించిన సంగతి తెలిసిందే. కాగా సోమవారం గెలిచిన సభ్యులంతా ఒక చోట కలుసుకున్నారు. అనంతరం మోహన్‌బాబు, మంచు విష్ణు, నరేష్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మోహన్‌బాబు మాట్లాడుతూ.. తనను కావాలని కొంతమంది రెచ్చగొడుతున్నారని, నేను అసమర్థుడిని కాను, మౌనంగా ఉంటున్న. ఎక్కడా మాట్లాడేందుకు వేదిక దొరక్క ఏదో వేదికపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని అవన్ని నవ్వుతు విని, సందర్భం వచ్చినప్పుడు స్పందిస్తున్న అని ఆయన అన్నారు.
మరీ మోహన్‌బాబు ఎవరిని ఉద్దేశించి అన్నది చెప్పలేదు కానీ, రిపబ్లిక్ సినిమా ప్రీరిలీజ్ వేదికపై పవన్‌కళ్యాణ్ ఏపీ ప్రభుత్వాన్ని, మీడియాపై విమర్శలు చేశారు. ఆ సమయంలో మోహన్‌బాబు కూడా స్పందించాలని కోరారు. అనంతరం చిరంజీవి శ్రీకాంత్ తనయుడు నటించిన పెళ్లిసందడి సినిమా ప్రీరిలీజ్ వేదికపై చిరంజీవి మాట్లాడుతూ ఒక చిన్న పదివి కోసం అంత లోకువ కావాలా అని ప్రశ్నించారు. ఒకరిపై ఒకరు విమర్శులు చేసుకోవడం కాదు. అసలు ఇది ఎక్కడ మొదలైందో ఎవరు మొదలుపెట్టారో వారిని గుర్తించి వారిని దూరం పెట్టాలని పిలుపునిచ్చారు. మనమంత వసుదైక కుటుంబం అని అన్నారు. మరీ మోహన్‌బాబు ఈ మెగా బ్రదర్స్‌ని ఉద్దేశించే ఆ వ్యాఖ్యలు చేసి ఉంటారని సినీ వర్గాలు భావిస్తున్నాయి. మరీ మోహన్‌బాబు వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.