దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, ఆలియా భట్, అజయ్ దేవ్గన్ వంటి భారీ తారాగణంతో తెరకెక్కిన చిత్రం ట్రిపుల్ ఆర్. కలెక్షన్ల పరంగా ఈ సినిమా గత రికార్డులన్నింటిని బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. ఇక ట్రిపుల్ ఆర్ విజయం చూసి బాలీవుడ్ ఇండస్ట్రీ జీర్ణించుకోలేకపోతుంది. కొందరైతే బహిరంగంగానే తమ అక్కసును వెళ్ల గక్కారు. ఇక మరికొందరు పిచ్చి వ్యాఖ్యలు కూడా చేశారు. ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలయ్యి నెలలు గడుస్తున్నప్పటికి దాని క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. సినిమాకు ఓ వైపు అంతర్జాతీయంగా ప్రశంసలు దక్కగా.. మరో వైపు కొందరు ప్రబుద్ధులు మాత్రం తమ వంకర బుద్ధిని బయపెట్టుకుంటూనే ఉన్నారు. సినిమా గురించి పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ఆస్కార్ అవార్డు విన్నర్, సౌండ్ డిజైనర్ రసూల్ పూకుట్టి ఆర్ఆర్ఆర్ సినిమాను గే స్టోరీగా చెప్పుకొచ్చి వివాదాన్ని ప్రారంభించారు. దాంతో రసూల్ పూకుట్టికి నిర్మాత శోభు యార్లగడ్డ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
తాజాగా ఈ వివాదంపై ఎంఎం కీరవాణి స్పందిస్తూ చేసిన ట్వీట్ మరింత రచ్చకు దారి తీసింది. ఒక్క ట్వీట్‌తో కీరవాణి వివాదాన్ని మరింత పెద్దది చేశారంటున్నారు నెటిజనులు. చేసింది ఒక్క ట్వీటే కానీ.. అది సృష్టించిన రచ్చ అంతా ఇంతా కాదు అంటున్నారు నెటిజనులు. తాను ప్రతి ఒక్కరి స్వేచ్ఛను గౌరవిస్తానంటూనే, ఇంగ్లీష్‌లో అక్షరాలు టైప్ చేయడం తనకు సరిగా రాదని… అప్పర్ కేస్, లోయర్ కేస్ టైపింగ్‌లో బ్యాడ్ అంటూ రసూల్ పూకుట్టి పేరులో కొన్ని అక్షరాలను అప్పర్ కేస్‌లో టైప్ చేశారు. అందులో బూతు అర్థం వచ్చేలా ఉండటం గమనార్హం.
ఇది కూడా చదవండి: Resul Pookutty: ఆస్కార్ విన్నర్ సంచలన వ్యాఖ్యలు.. ‘RRR ఓ చెత్త సినిమా.. గే స్టోరీ’
కీరవాణి ట్వీట్లో బూతు నెటిజన్లకు సులభంగా అర్థమైంది. ఆయన తీరు సరి కాదని కొందరు ట్వీట్లు చేశారు. ట్వీట్ చేసిన కాసేపటికి కీరవాణి డిలీట్ చేసినా… ఆయన మీద వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. బుధవారం సాయంత్రం ఒక్క ట్వీట్‌తో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిన ఎంఎం కీరవాణి… ఈ రోజు ఉదయం మరికొన్ని ట్వీట్లు చేశారు. టైపింగ్ డిఫెక్ట్ పోయిందని, కొత్తగా క్యారెక్టర్ బ్లైండ్నెస్ వచ్చిందని పేర్కొన్నారు. తనకు రామ్, భీమ్ క్యారెక్టర్లు కనిపించడం లేదని.. దేశభక్తుడు అయినటువంటి అజయ్ దేవగణ్ పాత్ర ఒక్కటే కనిపిస్తోందటూ ట్వీట్లు చేశారు. గే లవ్ స్టోరీ కామెంట్లపై వ్యంగ్యంగా స్పందించారు. కీరవాణి చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: RRR పై విషం చిమ్ముతున్న బాలీవుడ్! సీరియస్ అయిన నిర్మాత!