థింక్ బిగ్.. డ్రీమ్ బిగ్..అండ్ అచీవ్ బిగ్.. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు అన్న మాటలు ఇవి. అయితే.. ఒక్క ఛాన్స్ ప్లీజ్ నా టాలెంట్ చూపిస్తా అంటూ సినిమా ఆఫీసుల చుట్టూ తిరుగుతూ, ఏ చిన్న అవకాశం వచ్చినా వదులుకోకూడదని, ఎదో ఒకటి చేసేసి చివరికి.. ఉట్టికి, స్వరానికి కాకుండా మిగిలిపోతున్నారు చాలా మంది యువకులు. కానీ.., ఇలాంటి పరిస్థితిల్లో కూడా ఓ యువ దర్శకుడు మాత్రం తాను అనుకున్న కథను.. తాను ఊహించినట్టుగానే భారీ స్థాయిలో తెరకెక్కించి, తన చిరకాల స్వప్నానాన్ని సాకారం చేసుకున్నాడు.
భారీ బడ్జెట్ తో, భారీ తారాగణంతో దర్శకుడిగా తన తొలి చిత్రాన్ని తెరకెక్కించి విజయాన్ని దక్కించుకున్నాడు. ఒక ప్రాంతీయ భాషలో తాను దర్శకత్వం వహించిన సినిమా.. ప్రతిష్టాత్మక ఓటీటీ ప్లాట్ ఫామ్ అయిన నెట్ ఫ్లిక్స్ ద్వారా విడుదలై.. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంశలు అందుకుంటోంది. నెట్ ఫ్లిక్స్ లో తెలుగు, తమిళ, మలయాళ వెర్షన్ కి మంచి రెస్పాన్స్ రాగ, యూట్యూబ్ లో విడుదలైన హిందీ వెర్షన్ మూడు రోజుల్లోనే మూడన్నర కోట్ల వ్యూస్ సాధించి, హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాల్లో సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. ఇంతకు ఎవరా యువ దర్శకుడు? ఎవరా భారీ తారాగణం? ఏమిటా సినిమా? అన్నదేగ మీ సందేహం.. తొలి సినిమాతోనే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అటెన్షన్ ని తవ వైపుకి తిప్పుకున్న ఆ యువ దర్శకుడు అచ్చ తెలుగువాడైన నరేంద్రనాధ్ కాగ, ఆ సినిమా “మిస్ ఇండియా”.
మహానటి తరువాత ఒక్కసారిగా ఓవర్ నైట్ స్టార్ గా ఎదగడమే కాకుండా, నేషనల్ అవార్డు గెలుచుకున్న హీరోయిన్ కీర్తి సురేశ్ టైటిల్ రోల్ పోషించగా, జగపతిబాబు, రాజేంద్ర ప్రసాద్, నరేశ్, నదియా, నవీన్ చంద్ర వంటి తారాగణం ప్రముఖ పాత్రలలో నటించిన “మిస్ ఇండియా”. ఈ మూవీని ఇండియన్ చాయ్ కి, అమెరికన్ కాఫీకి మధ్య జరిగే వెర్బల్ ఫైట్ లాంటి ఒక విభిన్న కథాంశంతో రూపొందించడం విశేషం.
కరోనా కారణంగా థియేట్రికల్ రిలీజ్ సాధ్యం కాకపోవడంతో ఓటీటీ, యూట్యూబ్ ద్వారా ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ సినిమా వ్యూస్ పరంగా, లైక్స్ పరంగా సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. గోల్డ్ మెయిన్ టెలీ ఫిలిమ్స్ వారు ఈ మూవీ హిందీ వెర్షన్ ని జూలై 4న యూట్యూబ్ లో రిలీజ్ చేయగా, తొలి మూడు రోజుల్లనే 30 మిలియన్స్ పైగా వ్యూస్ దక్కించుకోవడంతో మిస్ ఇండియా దర్శకుడు నరేంద్రనాధ్ పై ప్రశంశల జల్లు కురుస్తోంది. మహానటి తరువాత కీర్తి సురేశ్ దాదాపు 22 కథలు విని, చివరకి ఫైనల్ చేసిన స్క్రిప్ట్ ఇదే కావడం విశేషం. ఈ నేపథ్యంలో యువ దర్శకుడు నరేంద్రనాధ్ మిస్ ఇండియా గురించి తెలిపిన వివరాలు, విశేషాలు ఏమిటో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.
1)ఇండియన్ చాయ్ హీరో, అమెరికన్ కాఫీ విలన్.. ఇలాంటి ఒక డిఫరెంట్, టిపికల్ కాన్సెప్ట్ ని కథగా ఎంచుకోవాలన్న ఆలోచన మీకు ఎలా కలిగింది?
2) సాధారణంగా తొలి సినిమా లవ్ స్టోరీలే సక్సెస్ ఫార్ములా అనుకుంటారు. మరి.. ఈ కథతో ప్రయోగం చేస్తున్నానని మీకు అనిపించలేదా?
నో డౌట్. ఇది ముమ్మాటికీ ప్రయోగమే. అయితే.., కచ్చితంగా సక్సెస్ అవుతుందన్న నమ్మకంతో చేసిన ప్రయోగం. డిఫరెంట్ పాయింట్, రొటీన్ కి భిన్నమైన నావల్టీ ఉండబట్టే కదా? ఇంత మంది ప్రముఖులు ఈ కథని ఓకే చేసింది.
3) ఈ కథను ముందు సమంత, నయనతారకి కూడా వినిపించారట కదా? మరి.. వారందరిని దాటుకుని ఈ కథ కీర్తి సురేశ్ దగ్గరికి రావడానికి కారణం ఏమిటి?
4) ఇంత పెద్ద సినిమా ఎప్పుడు రిలీజ్ అయ్యిందో కూడా తెలియదు. యూట్యూబ్ లో రిలీజ్ అయ్యి, మినిమమ్ వ్యూస్ వచ్చే వరకు చాలా మందికి తెలియకపోవడం ఏమిటి?
5) ఇంత మంచి సినిమా థియేటర్ లో రిలీజ్ ఉంటుందా?
6) నరేంద్రనాధ్ గతంలో ఎవరి దగ్గరైన అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారా?
7) తొలి ప్రయత్నంలోనే విమెన్ సెంట్రిక్ ఫిల్మ్ చేయడానికి మీ ఇన్స్పిరేషన్ ఎవరు?
8) తదుపరి ప్రయత్నాలు మొదలు పెట్టే ఉంటారు.. ఆ వివరాలు ఏమిటి?