స్టార్ హీరోయిన్ తాప్సి దాదాపు మూడేళ్ళ తర్వాత తెలుగు తెరపై సందడి చేయబోతుంది. తెలుగులో ‘ఏజెంట్ శ్రీనివాస ఆత్రేయ’ మూవీతో దర్శకుడిగా అడుగుపెట్టి.. మొదటి సినిమాతోనే ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించాడు స్వరూప్ RSJ. తన రెండో సినిమాగా ‘మిషన్ ఇంపాజిబుల్’ తెరకెక్కించాడు. ఈ సినిమాలో తాప్సి ప్రధాన పాత్ర పోషించింది. ఏప్రిల్ 1న రిలీజ్ కానున్న ఈ సినిమాను మాట్నీ అండ్ పిఏ ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్లపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కి టాలీవుడ్ యంగ్ డైరెక్టర్స్ తో పాటు మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. ఈ క్రమంలో యువదర్శకులను ప్రోత్సహిస్తూ మాట్లాడిన చిరు.. హీరోయిన్ తాప్సి పై క్యూట్ కామెంట్స్ చేశారు. “తాప్సిని ఝుమ్మంది నాదం సినిమా టైంలో చూసినప్పుడు బాగుంది.. స్ట్రైకింగ్ గా ఉంది.. వావ్ అనుకున్నా. కానీ అప్పట్లో నేను పాలిటిక్స్ లోకి వెళ్ళిపోయి తనతో చేసే అవకాశం మిస్ అయ్యాను.
ఒక్కోసారి ఇలాంటోళ్లను చూసినప్పుడు నేనెందుకు పాలిటిక్స్ లోకి వెళ్ళానా అనిపిస్తుంటుంది. ఎందుకెళ్లానా అని రెగ్యులర్ గా ఫీల్ అవుతుంటాను. ఈసారి నాకు తనకు అవకాశం ఎందుకివ్వకూడదు నిరంజన్.. డైరెక్టర్ గా ఈ కుర్రాళ్లలో ఎవరైనా పర్లేదు. కానీ చూడు తాప్సి.. నువ్ అమితాబ్ గారి సినిమాలో డామినేట్ చేసినట్లుగా చేస్తే నేను, సుమ ఒప్పుకోము” అంటూ మాట్లాడారు. ప్రస్తుతం తాప్సిపై చిరు చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.