ప్రముఖ హీరోయిన్ మీనా భర్త చనిపోయిన విషయం తెలిసిందే. ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ చనిపోయారు. దీంతో మీనా కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. పెళ్లైన 13 ఏళ్లకే భర్త చనిపోవడంతో మీనా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. భర్తే తన ప్రపంచం అనుకుని బ్రతికిన ఆమె.. ఇప్పుడు ఆ భర్తే లేడనే విషయాన్ని జీర్ణించుకోలేపోతున్నారు. కాగా.. భర్త మృతిపై మీనా మొదటిసారి స్పందించారు. సోషల్‌మీడియాలో ఆమె పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది.
నా లవింగ్ హస్బెండ్‌ను కోల్పోయి చాలా బాధలో ఉన్నాను. ఈ టైంలో మా ప్రైవసీని గౌరవించాలని మీడియాను కోరుతున్నాను. మాకు సంబంధించిన తప్పుడు ప్రచారాన్ని బ్రాడ్‌కాస్ట్ చేయడం మానేయండి అని రాసుకొచ్చారు మీనా. దాంతో పాటుగా.. కష్టసమయాల్లో తన ఫ్యామిలీ వెంట నిలబడ్డ.. వారందరికీ మీనా థ్యాంక్స్ చెప్పారు. ఇక తన భర్తను కాపాడేందుకు ప్రయత్నించిన మెడికల్ టీమ్, సీఎం స్టాలిన్, తమిళనాడు హెల్త్ మినిస్టర్ రాధాకృష్ణన్, కొలిగ్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, మీడియా, ఫ్యాన్స్‌కి ధన్యవాదాలు చెప్పారు మీనా. తన గురించి ప్రార్థించిన ప్రతి ఒకరికి పేరు పేరున కృతజ్ఞతలు. మీ మీనా సాగర్ అంటూ పోస్ట్‌ను ముగించారు. మరి మీనా పోస్టుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.