పై ఫొటోలో కనిపిస్తున్న చిన్నారి స్టార్ హీరోయిన్గా తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమను ఏలారు. చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరితో అయితే నటించారో.. తర్వాతి కాలంలో వారితోనే హీరోయిన్గా చేశారు.
చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. స్టార్ హీరోయిన్లుగా మారిన వారు ఇండస్ట్రీలో అతి కొద్ది మంది మాత్రమే ఉన్నారు. అంతేకాదు! చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఓ స్టార్ హీరోతో నటించి.. హీరోయిన్గా మారిన తర్వాత అదే స్టార్ హీరో పక్కన నటించిన వారు వేళ్ల మీద లెక్కించే సంఖ్యలో ఉంటారు. అలాంటి వారిలో పై ఫొటోలో కనిపిస్తున్న చిన్నది కూడా ఉంటుంది. ఆమె రజినీకాంత్ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించింది. తర్వాతి కాలంలో హీరోయిన్గా ఆయనతో జోడీ కట్టింది. ఎన్నో హిట్టు సినిమాల్లో నటించింది.
ఇప్పటికే ఆ హీరోయిన్ ఎవరో అర్థం అయిపోయి ఉంటుంది. మీరు గెస్ చేసింది నిజమే.. ఆమె ఇంకెవరో కాదు.. మీనా సాగర్. మీన 1982లో వచ్చిన ‘నెంజంగల్’ అనే తమిళ సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా తెలుగు, తమిళం, హిందీ, మలయాళం భాషల్లో 20కిపైగా సినిమాల్లో నటించారు. నవయుగం అనే తెలుగు సినిమాతో హీరోయిన్గా మారారు. హీరోయిన్గా తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో సినిమాలు చేశారు.
చిరంజీవి, రజినీకాంత్, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ ఇలా అందరు స్టార్ హీరోలతో ఆమె నటించారు. 2009లో సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయిన విద్యాసాగర్‌ను పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు నైనిక అనే కూతురు ఉంది. 2022లో విద్యాసాగర్ అనారోగ్య కారణాల వల్ల చనిపోయారు. భర్త మరణంతో ఆమె ఎంతో కృంగిపోయారు. కొంత కాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. తర్వాత మళ్లీ సినిమాలు చేయటం మొదలుపెట్టారు. ప్రస్తుతం ఆమె తమిళంలో రౌడీ బేబీ అనే సినిమాలో నటిస్తున్నారు.