సోషల్ మీడియా వినియోగం పెరిగాకా.. ఏవి నిజాలో.. ఏవి పుకార్లో అర్థం కాని పరిస్థితి. ముందు కావాలని ఎవరో ఒకరు ప్రారంభిస్తారు. ఆ తర్వాత మిగతా వాళ్లు.. వారిని గుడ్డిగా ఫాలో అవుతారు. ఆ వార్తలో నిజం ఉందా లేదా అని ఆలోచించరు. ఇక సెలబ్రిటీల విషయంలో ఇలాంటి సంఘటనలు తరచుగా చోటు చేసుకుంటాయి. సినిమాలకు సంబంధించిన వార్తలే కాక.. వారి వ్యక్తిగత జీవితాలకు సంబంధించి కూడా పలు తప్పుడు వార్తలు ప్రచారం చేస్తుంటారు. ఆఖరికి సదరు సెలబ్రిటీలు తెర మీదకు వచ్చి.. ఆ వార్తలపై క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. తాజాగా సీనియర్ నటి మీనాకు కూడా ఇదే పరిస్థితి ఎదురయ్యింది. భర్త చనిపోయిన బాధ నుంచి ఇంకా కోలుకోకముందే.. ఆమె రెండో పెళ్లికి సిద్ధమయినట్లు వార్తలు ప్రచారం అవుతున్నాయి. దీనిపై మీనా మండిపడ్డారు. డబ్బుల కోసం ఏమైనా రాస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రెండో పెళ్లి చేసుకోబోతుందంటూ వస్తున్న వార్తలపై మీనా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ‘‘కొంచెమైనా బుద్ధి ఉందా.. డబ్బు కోసం ఏమైనా చేస్తారా.. మీకు ఎవరు చెప్పారు.. నేను రెండో పెళ్లి చేసుకోబోతున్నానని.. సోషల్ మీడియా రోజు రోజుకు దిగజారిపోతుంది. వాస్తవాలు తెలుసుకుని.. అప్పుడు వార్తలు రాయండి. దిగజారి ప్రవర్తించకండి. నా భర్త చనిపోయినప్పుడు కూడా ఇలానే తప్పుడు ప్రచారం చేశారు. అవి ఇంకా ఆగలేదు. ఇలాంటి తప్పుడు వార్తలు పుట్టించే వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకునేలా చేస్తాను’’ అంటూ సీరియస్ అయ్యింది మీనా.
ఇటీవలే మీనా భర్త విద్యాసాగర్ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే ఆమె ఆ బాధ నుంచి కోలుకుని.. మళ్ళీ ప్రొఫెషన్ పరంగా యాక్టివ్ అవుతున్నారు. అయితే మీనా కుటుంబ సభ్యులు ఆమెకు రెండో పెళ్లి చేయాలని భావిస్తున్నారని.. దీని గురించి మీనాను అడిగితే.. ఆమె రెండో పెళ్ళికి నిరాకరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కానీ మీనా కుటుంబ సభ్యులు మాత్రం.. “నీకు భర్త అవసరం నీకు లేకపోయినా.. నీ కూతురికి తండ్రి అవసరం ఉంది, అందుకే పెళ్లి చేసుకో” అంటూ ఆమెను రిక్వెస్ట్ చేశారని వార్తలు వచ్చాయి. తాజాగా మీనా స్పందన చూస్తే ఇవన్ని వట్టి పుకార్లే అని అర్థం అవుతోంది.